Friday, December 14, 2012

డర్టీ ,కక్కూర్తి.


నాక్కొంచెం ఈ మధ్య కళ్ళు తిరుగుతున్నయ్. నాకు ఏ జబ్బు రాకుండ
నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామీ,
నా భార్య పిల్లలకి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వు స్వామీ,
త్వరలో నేను అనుకున్నట్లుగా ఆ జాబ్ నాకు రావాలి స్వామీ,
అమ్మని నాన్నని మంచిగా చూడు స్వామీ,
మా అక్కకి పిల్లలు పుట్టాలి స్వామీ,
మాకు ఎటువంటి డబ్బు సమస్యలు లేకుండ చూడు స్వామీ,
ఈ సంవత్సరం కారు కొనాలనుకుంటున్నా అది అయ్యేట్టు చూడు స్వామీ,
మా ఇంటి పక్కోళ్ళు చాలా బాధలు పడుతున్నారు.వాళ్ళ కష్టాల్ని తొలగించు స్వామీ,
రోజూ నేను ఇంటికొచ్చేప్పుడు కుక్కలు ఎంటబడకుండ చూడు స్వామీ,
.........................................................
........................................................
స్వామీ స్వామీ ప్రత్యక్షం అయ్యావా ?నేనెంత అదృష్ట వంతుణ్ణి
నేనెంత పుణ్యం చెసుకున్నా? స్వామీ స్వామీ ఇప్పుడు నే కొరిన కోర్కెలన్ని తీరుస్తావుగా.
ఓ రీ భక్తా! అదే !నీ ఈ అజ్ఞానాన్ని తొలగిద్దామనే నీకు ప్రత్యక్ష మయ్యా.
నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో నాకు అన్నీ తెలుసు రా.
కోర్కెలు కోరకు.నన్ను స్మరించుకో .నీకు నేను ఇచ్చింది తీసుకో .అది కష్టమే కానీ .సుఖమే కానీ.ధనమే కానీ ,దరిద్రమే కానీ.
అది రా భక్తి అంటే.
కొర్కెల లిస్ట్ చెప్పడం భక్తి కాదురా .డర్టీ కక్కూర్తి.


Thursday, December 13, 2012

కాంటాక్ట్ నెంబర్లు

కాంటాక్ట్ నెంబర్ లు  కాంటాక్ట్ నెంబర్  లు  అని ఏడ్చి గగ్గోలు పెడితే ఇచ్చా.
సరె రా .ఏమైంది ఇప్పుడు ?
 నీ ఫ్రెండ్ గానీ ఏదన్నా వెధవ పని చేసాడా?
అడిగాడు తండ్రి.
అది కాదు డాడీ.
నేను కొన్ని కాంటాక్ట్ నెంబర్లు నా క్లోజ్ ఫ్రెండ్స్ వి ,మన బంధువులవి ఇచ్చాను వేరే ఫ్రెండుకి.
వాడు కావలసిన దానికి వాళ్ళని  ఫొన్  చేసి ఆడిగాడు బాగానే ఉంది.
ఒకసారి అడగాలి.లేదు రెండు సార్లు
.వాళ్ళకి ఇష్టం లేదంటే వదిలెయ్యాలి.
అసలు ఇదేంటి డాడీ పొద్దునా సాయంత్రం రోజుకి రెండు పూట్లా ప్రతి రోజూ వాళ్ళు వద్దన్నా వినకుండా
ఇష్టం లేదన్నా విడిచి పెట్టకుండా రేపు,,రేపు  చేసి గానీ వదిలి పెట్టట్లా.
వాళ్ళందరు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు.
ఎందుకు మా నెంబర్లు ఇన్సూరెన్సు వాళ్ళకి సేల్సు వాళ్ళకి ఇచ్చావని.
అయ్యయ్యో .నీ బాధ నాకు అర్థం అయింది గానీ ,
అదేం భాష రా నువ్వు  మాట్లాడేదీ.
అసలు ఇన్సూరెన్సు కంపెనీ ఏజెంటు కి నెంబర్లు ఇవ్వడమెందుకు ,
ఇట్లా తిట్టుకోడమెందుకు నాన్నా?
కొడుకుని ఓదార్చాడు తండ్రి.