Friday, May 29, 2015

మనిషిని ఎట్లా పంపాలి ఎనక్కి.


.
వాకిట్లో నిలబడింది లక్ష్మమ్మ.
తోచదూ తొచదూ అంటుంది.
ఎప్పుడూ .
ఎవరో ఒకళ్ళు ఇంటికి రావాలి .
కూర్చుని కబుర్లు చెప్పాలి. 
ఆ రోజు సాయంత్రం నాకు కాస్త ఖాళీ దొరికింది.అటుగా వెళ్ళా.
నన్ను చూడగానే వాకిట్లోనుండి ఇంట్లోకి తీసికెళ్ళి కూర్చోబెట్టి ముచ్చట్లు మొదలు పెడుతుందేమో నని అనుకున్నా.కానీ ఎంతకి వెనక్కి అడుగెయ్యలా .
అట్లాగే నిలబడి మాట్లాడిస్తున్నా .లక్ష్మమ్మ కూడా ఏదో మాట్లాడుతోంది .
రోజు అంత చక్కగా కూర్చోబెట్టి మాట్లాడిచ్చేది. 
ఈ రోజు ఏమయిందో నా కు అర్థం కాలేదు.
కాసేపు ఇద్దరం మౌనంగా ఉన్నాం.
అప్పుడు అన్నది,'పాపం నీకేమన్న పనుందేమో,నీకేమన్న పనుందేమో .ఎవరి పన్లు వాళ్ళకుంటయ్ దాందేముంది ' రెండు మూడు సార్లు అన్నది.
నాకు అర్థమయ్యింది తిరిగి ఇంటికి వచ్చేసాను.
తరువాత నాకు ఇంకో ఫ్రెండు చెప్పింది బోరు కొట్టనప్పుడు ముచ్చట్లు అఖ్ఖర్లేనప్పుడూ అట్లా పంపించేస్తుందంట.
ఎళ్ళగొట్టే నేర్పు కూడా ఉండాలి అనుకున్నా.

Monday, May 18, 2015

చిన్న పొరపాటు

పెళ్ళికొచ్చిన ఓ పెద్దమనిషి పెళ్ళిళ్ళలో నీళ్ళు శుభ్రంగా ఉండవని మినరల్ వాటర్ బాటిల్ వెంట తెచ్చుకున్నాడు.అందరికన్నా ముందుగానే వచ్చేసాడు. దాహం అయింది కాబోలు కాసేపు కూర్చున్నాక. ఓ రెండు గుటకలు వేసాడు బాటిల్ నోటిక్కరిపించుకుని.
మెడ వెనక్కి పోదు. స్పాండిలైటిస్ ఉంది. అందుకే నోటిక్కరిపించుకొని త్రాగేసాడు.
నెమ్మదిగా పెళ్ళికి అందరూ వచ్చేసారు కాసేపటి తరువాత.
పెద్దమనిషి కి మళ్ళీ దాహం వేసింది.నీళ్ళు తాగుదామని బాటిల్ తీసాడు.నోటిక్కరిపించుకుంటే అందరూ నవ్వుతారని కాస్త కష్ట పడి ఎత్తి పోసుకున్నాడు ఈ సారి.
ఇది గమనించారు చుట్టు ప్రక్కల కూర్చున్న ఓ నలుగురు.
పెద్దమనిషిని రిక్వెస్ట్ చేసారు.
ఆ పెద్దమనిషి నీళ్ళకి కాదనలేకా  నిజం చెప్పలేకా నలిగి పోయి ఇచ్చేసాడు వాళ్ళకి నీళ్ళ బాటిల్.
ఎంతైనా నీళ్ళు కదా కాదనకూడదు.ఇవ్వాలి.

Sunday, May 17, 2015

గొప్ప తెలివైనోళ్ళు

పెద్ద రొడ్డే .
కాలనీలో అయినా .
ట్రాఫిక్ అంతా ఆగిపోయింది.
ముందు ఏదో వెళ్తోంది.ఆ వెళ్ళేది లారీ నో ట్రాలీ నో అర్థం కావట్లా ఎవ్వరికీ.
చాలా వేళ్ళాడుతున్నాయి.క్యారీ బ్యాగులూ, సంచులూ,కాగితాలూ,పేపరు కట్టలూ,విరిగిపోయిన కుర్చీలు,చిన్నపిల్లల సైకిళ్ళూ,ప్లాస్టిక్ కుర్చీలూ అన్నీ ఉన్నాయ్.
అసలు వెహికిలే కనబడట్లా.
జనం విసిగి పోయారు.పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.
 ఓ యస్సై గారు వచ్చారు.
ఆయనకి కూడా అర్థం కాలా .సైడు కూడా దొరకలా.
వేరే రోడ్డు లోంచి ఎదురు వెళ్ళాడు.
''అరేయ్ పెద్ద బండి పెద్ద వెహికిలు అని చస్తున్నారు ఎనక జనం.
చెప్పి చావరా ఈ ముదనష్టపు సైకిలు కి ఇవన్నీ కట్టి ఇంత సీను చేస్తున్నావనీ'''
 యస్సై గారి మాటలు వెనుక ఉన్న వాళ్ళకి వినబడినై.
అందరూ మూర్చపోయారు.