Sunday, February 15, 2015

ఎంతైనా సొంత పిల్లలు కదా?

ఇప్పుడు ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అన్నాడు దేవుడు.
అవును ఆ ప్రేమ కన్నప్పుడే ఉంటుంది కంటేనే పిల్లలని నేను అంటే మీరు విన్నారా స్వామీ గతంలో మీరు ఏం తప్పు చేసారు అన్నది దేవత.
  >>>>>>                >>>>>>>>>>>>>>                  >>>>>>>>>>>>>>>        >>>>>>>
ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సృష్టి కర్త.
కేవలం మనుష్యులు అందరూ మనుష్యులే సృష్టించ బడ్డారు.
వారికి పిల్లలు కలగరు.ఆడా మగా  తేడా లేదు.అందరూ ఒకటే.
మరి ఈ లోకానికి మనుష్యులు కావాలి .ఏకంగా పెద్దవాళ్ళనే సృష్టిస్తే  వాళ్ళు అన్నీ నేర్చుకోలేరు. ఆది కూడా ఒక సారి జరిగింది.

మరి పిల్లల్ని ఎలా సృష్టించాలి.దానికి దేవుడు కి మొదట అర్థం కాలేదు .తరువాత ఒక ఆలోచన వచ్చింది.
చెట్టుకి కాయలు కాసినట్టు పిల్లలు కూడా కాస్తే.

అలానే కాసారు  .ముద్దుగా ఉన్నారని అందరూ కోసుకునేవారు ,తీసుకునేవారు.కానీ కొన్ని రోజులే  ప్రేమ గా చూసుకునే వాళ్ళు  .ప్రేమ కరువై రక్షణ కరువై పిల్లలు నశించి పోవడం మొదలైంది.

నరజాతి అంతరించి పోతుందనే భయం పట్టుకుంది దేవుడికి.
అప్పుడే సృష్టి  కర్తకి ఆడా మగా సృష్టించాలనే  అలోచన వచ్చింది.వెంటనే అమలులోకి వచ్చేసింది అది.

అప్పటి నుండి పిల్లలు  ఎంతో ప్రేమ పొందుతున్నారు.వాళ్ళకి రక్షణ దొరుకుతోంది.
వాళ్ళ భవిష్యత్తుకి పెద్ద పీట వెయ్యడానికి మనుష్యులు ఒకళ్ళని ఒకళ్ళు దోచుకోవడం కూడా మొదలయింది.
ఎంతైనా సొంత పిల్లలు కదా?

Thursday, February 12, 2015

అడుక్కోవడానికి అడ్డమొచ్చే భిక్ష గాళ్ళు

గ్రీన్ లైట్ సిగ్నల్ పడ్డాక కూడా
 అడ్డమొచ్చే భిక్ష గాళ్ళు.
ముట్టుకునీ,పట్టుకునీ
బలవంతం చేసి మరీ
అడుక్కునే బలమైన వాళ్ళు .

ఈ  బిచ్చగాళ్ళకి
సహాయం చెయ్యాలంటే అసహ్యమే.
కూడళ్ళు లేవా? అంగళ్ళ ముంగిళ్ళు లేవా?


వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ?
కౌన్సిలింగ్ ఇచ్చే భాద్యత ఎవరిది?.
ఎవరు చోద్యం చూస్తూ కూర్చుంటున్నారు?.


వీళ్ళు చాలదన్నట్లు వీధుల్లో ఒరిజినల్ బ్యాట్లతో సిక్సర్లు కొడుతూ
మనుష్యుల ముఖాలు పచ్చళ్ళు చేసే వాళ్ళు
హాస్పిటల్ ఖర్చు పెంచే వాళ్ళు మరి కొందరు.
ఓపిక కి హద్దు.
ఎవరు మారాలి?
ఎవర్ని మార్చాలి
ఎంత టైం కావాలి
ఎన్ని ఎన్నికలు వెళ్ళిపోవాలి?

నేటి దుఖాః న్ని నిన్నటి సంతోషం ఆపుతుందా?

నేటి దుఖాః న్ని  నిన్నటి సంతోషం ఆపుతుందా?
గతంలో ఆస్వాదించిన అనుభూ తులు నేటి కన్నీళ్ళకి ఫుల్ స్టాప్ పెడతాయా?
అంతం ఆరంభమవుతుందా?
నువ్వొక సెలెబ్రిటీ కావచ్చు ,,అమెరికాకి ప్రెసిడెంటు  వి కావచ్చు.
పూరి గుడిసె లో పెద్ద దిక్కు కావచ్చు.
అది రాకుండా మాత్రం ఆగదు.
జననం ఆనందమే అయినా 
జీవితం విషాదంతో  ముగియాల్సిందే
ముగింపు ,,వద్దనుకుంటే  ఆగేది కాదు .
విచారమే  శాశ్వతం.
విశాల విశ్వంలో ఎక్కడికో  మనమెక్కడికో వెళ్ళిపోతాం.
 ఈ ఆహా ఓహో లు ,ఆనందాలు ఒక్క నాడే.
వైభోగం రెండు నాళ్ళే.
మొత్తం కలిపి ఈ జీవితం మూడు నాళ్ళే.
సందర్శనార్థం బయట పెట్టక మానరు.
 సంపాదన కోట్లైనా.

Tuesday, February 10, 2015

కమలం

తొమ్మిది నెలలు గడిచినై పార్లమెంటుకొచ్చి కమలం
బీ జే ఫి ఏదో చేస్తుందని అనుకున్నాడు బజ్జీలమ్ముకునే వాడు కూడా .
 కాస్త కూడా నమ్మకం కలగలేదేమో ?

సామాన్యుడు  సాధించిన విజయం చూసి  సిగ్గేస్తోందా?
లేడీ లనీ ,బేడీ లనీ నిలబెట్టే
ఎత్తుగడల రాజకీయాలు కాంగ్రేసు  నుండి నేర్చుకుంటున్నారా ?
అల్రెడీ నేర్చేసుకున్నారు లా ఉంది .
ప్రజలకి తెలిసి పోతోంది
మీరు కూడా మాజీ ప్రభుత్వానికి, పార్టీకి  ఏమీ తీసి పోరని  .
ఎంతో  నెత్తిన పెట్టుకొని ఢిల్లీ గద్దె నెక్కిస్తే
గల్లీల్లో  పల్లీలమ్ముకునే దుస్తితి  దాపరించింది .
యావత్తు దేశాన్నీ,, మిమ్మల్ని అభిమానించే వాళ్ళని కుళ్ళ బొడిచారు. 

Saturday, February 7, 2015

నువ్వంటే ఎంత ఇష్టమో

వెన్నలాంటి మనసుంటే చాలదు
తప్పుచేసినా చెప్పనంత నైసుగ ఉండాలి
కుప్పలు కుప్పల డబ్బులు కుమ్మరిస్తుండాలి
అడిగినప్పుడల్లా కడిగైనా ఇచ్చేస్తుండాలి
కష్టమే ఐనా నువ్వంటే ఎంత ఇష్టమో
నువ్వు లేక పోతే  ఉండాలేనంటారు
నువ్వంటే పిచ్చి అంటారు
నీకు కొంచెం బాధొచ్చినా ఓర్చుకోలేమంటారు.
నువ్వు తిన్నావా లేదా అని అడుగుతారు
నిద్ర పడుతోందో లేదో విచారణ చేస్తారు.
నువ్వొక మంచి తండ్రివనీ
ఓ మంచి కొడుకువనీ
ఓమంచి భర్తవనీ
సర్టిఫయ్ గట్టిగా నే  చేసేస్తారు.

Thursday, February 5, 2015

కరోడ్లు గడించి

రోడ్డు దాటే ప్రయత్నం లో  .
మధ్యలో నిలబడతారు  మనుష్యులు.
శ్మశానానికి  పోవడానికే కానీ
రోడ్డు అవతలి కి దాటడానికి కాదు.
దాటే వాళ్ళున్న
 విషయం  తెలియదు .
ఆ దృశ్యమూ కనిపించదు.
దగ్గర దగ్గరకి వచ్చేవి,
 రాకెట్లలా దూసుకుపొయ్యేవి, 
రాసుకుని పోయే వి,
 తీసుకుని పోయేవి.
క్షేమంగా రోడ్లు దాటించలేని రాజులు
కరోడ్లు గడించి
సిగ్గు విడిచి సెక్యురిటీ తో తిరుగుతారు.
వందలమందిని ఆపుతారు  
వీళ్ళకి ఈ రోడ్డు దాటే బాధేంటో
తెలియడానికి కాళ్ళుండవు
 కనిపించడానికి కళ్ళుండవు .

Monday, February 2, 2015

ఏ సీటు?

ఆటో ల లో తంటాలు.
ఆక్సిడెంట్  అయింది.
 సీటు పోయింది.
అక్కడ పోటు మొదలయ్యింది.
ఏ  సీటు?
కూర్చునే సీటు కాదు.
మీద మీద కూర్చునే వాళ్ళ మధ్య .
చోటు లేక
పక్కకి కూర్చో బెట్టాడు డ్రైవరు.
సీటు బయటకు పెట్టి కూర్చుంటే
కారొచ్చి గుద్దింది.
సొంత సీటు కే తూటు పడింది.
అందుకే జాగ్రత్తగా కూర్చోండి.

Sunday, February 1, 2015

పిల్లలు

'' పిల్లలు
మర్యాద ,విధేయత మరచి
తప్పు మాట్లాడినా''

 
''కోపం వచ్చీ
తెచ్చుకోకుండా
త్రెంచుకోకుండా
మనసులో పెట్టుకోకుండా
అన్నీ మర్చి పోయి
ఒప్పులు చెప్పేది
తప్పకుండా చేసేది
ఒక్క తల్లి దండ్రులే ''
''చెయ్యాల్సిందీ వాళ్ళే''

''అయినా లెక్క చేయని,
అర్థం చేసుకోలేని,
దూరంగ ఉంచి ప్రేమని పంచని,
తల్లిదండ్రులని ఎదిరించే
పసివాళ్ళే పిల్లలు
వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే''