Saturday, December 26, 2015

దిగులుతో ముగుసింది సినిమా జీవితం.

దిగులుతో ముగుసింది  సినిమా జీవితం.
ఒంటరితనానికి మంటలే తోడొచ్చాయి.
ఒక్కమాటైనా చెప్పక పోతిరి.

పై బడ్డ వయసుకి పలకరింపులు ప్రతి ఇంటి లో నూ కరువే.
ఇది "ఇంటింటి రామాయణమే."
యవ్వనపు ఘడియలు ఇట్టే మాయమైపోతై.
అదో చాన్సు మాత్రమే.
సహజమని సరి పెట్టుకోవాలే కానీ ఉరి పెట్టుకుంటారా సార్.
అభిమానులకి ఇది జరిమానాయే.

Wednesday, November 11, 2015

సారొస్తా రొస్తారే రొస్తా రొస్తా రే

సారొస్తా రొస్తారే రొస్తా రొస్తా రే
ఏంటిరా పాటలు నీ మొహం చదువుకో నాన్న వచ్చే టైమైంది అన్నది అక్క.
కాసేపటికి మళ్ళీ
సారొస్తా రొస్తారే రొస్తా రొస్తా రే వో బస్తా బస్తా రో ఎక్కువతింటే చస్తావ్రో పాడుతున్నాడు.
అదిగో చెప్పానా ఒక్కసారి చెబితే బుద్ధుండాలి.పాడొద్దు నేను చదువుకుంటున్నా అన్నది అక్క.
ఇంతలో నాన్న రానే వచ్చాడు పాట విన్నాడు కూడా.
ఒరేయ్ వెధవా నీ పాటలేంటిరా చదువు ఒక్క ముక్కొచ్చారా నీకు ఏది
ఈ నంబరెంత చెప్పు 25.......... ట్వంటీ ఫాఇవ్
మరి ఇది 45 ఫార్టీ ఫాఇవ్
ఇది మరి 15
వంటీ ఫాఇవ్.
ముక్కు మీద గుద్దాడు తండ్రి
ఏడ్చుకుంటూ లోపలికెళ్ళాడు చిన్నోడు.
ఏమే నువ్వు చెప్పు
భూమి తిరుగుతుందని మనకి ఎందుకు తెలవట్లా.
మనకి బీ పీ వుంటే కద నాన్నా తెలిసేది.
అప్పుడు అమ్మకి బీ పీ వచ్చినప్పుడు చెప్పలా అంతా తిరుగుతోందని
నేనెట్ల చెప్తా నాన్నా నాకు బీ పీ లేదు కదా అన్నది అక్క  .
ఇంతలో లోపలి నుండి బుజ్జి గాడు అమ్మని తీసుకుని వచ్చాడు.
ఏంటండీ వాణ్ణి అంత చేటా కొట్టేది అన్నది.
అవునే వాడు వంటీ ఫాఇవ్ అంటున్నాడు.తెలుసా నీకు.
అయితే మాత్రం కొడతారా?
నేను వాడికి తండ్రినే.
కొడతా ఏమైనా చేస్తా.అన్నాడు.
అబ్బా దిగొచ్చారు తండ్రట
మీరు కాకపోతే ఇక వాడికి తండ్రులే లేనట్టు.
అరేయ్ కన్నా మనింటికి ఒక అంకులొస్తాడు చూడు
ఆ అంకుల్ కూడా నీకు తండ్రే.ఇహ నుండి అంకుల్ అని పిలవకురా .నాన్నా అని పిలువు.
పెద్ద ఈనొక్కడే తండ్రి తండ్రట.

Tuesday, November 10, 2015

ఇప్పుడు నొప్పి చాలా నయమయింది.

ఒకటో నంబరు బస్సు అది.ఆఫ్జల్ గంజ్ కి.
సన్నగా వర్షం.
లోపల సీటు దొరికింది.
సీట్లలో కూర్చున్నవాళ్ళు తప్పితే బస్సంతా ఖాళీనే ఆ టైంలో
.ఇంతలో కండక్టర్ వచ్చాడు.గోల్కొండ క్రాస్ రోడ్ ఒకటి ఇమ్మన్నా.అప్పటికి బస్ ,,స్టేషన్ దాటి బోయి గుడా వరకు వచ్చింది.
ఫుట్ బోర్డు మీద నిలబడ్డవాళ్ళు, వేళ్ళాడబడే వాళ్ళు కలిపి ఏడెనిమిదిమందే వుంటారు.ఇద్దరు అఫ్జల్ గంజ్ ,మరో ఇద్దరు కాచిగుడా ఒకడు చిక్కడపల్లి,మరొకడు నారాయణగూడా.బస్సంతా ఖాళీ అయినా వాళ్ళు కూర్చోరు.కండక్టర్ చెప్పొచ్చుగాఫుట్ బోర్డు మీదనిలబడ వద్దని అనుకున్నా మనసులో.
ఐనా చెప్పి చెప్పి విసిగిపోయి వుంటారు.పాపం వాళ్ళైనా ఎంతకని చెప్తారు.వీళ్ళల్లో మళ్ళీ రౌడీ మూకలుంటై.
వాళ్ళతో ఏం వేగుతారులే అనుకున్నా.ఐన ఈ పని చేయల్సింది కండక్టరూ మనమేనా?ఇంకెవ్వరికీ పట్టలేదా?
ఇంతలో నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది.కొంచెం జరగండి అన్నాను.ఎవరూ విన్న పాపాన పోలేదు.మళ్ళీ అరిచాను లాభం లేదు.ఇక తోసుకొని వెళ్ళాను.మధ్యలోనే ఇరుక్కొపోయా.కాళ్ళు పైకి లేపినా అలానే వున్నా.అంత టైట్ గా బిగించారు.దిగనీయండయ్యా బ్రతిమాలుకున్నా.ఎలాగోలా వూడి, క్రింద కాలు పెట్టే సరీకి బస్ పోతునేవుంది.
క్రింద పడ్డ నన్ను ఎవరో లేపారు.భరించలేని నొప్పి.ఎవరో అనుకుంటున్నారు,నడుము విరిగుండొచ్చని.జేబులో సెల్ ఇచ్చి నెంబర్ చెప్పా మా వాళ్ళది.
ఆ రోజు ఆపరేషన్.
ఆపరేషన్ ఐతే అయింది గానీ నొప్పి తగ్గడం లేదు.నాలుగు నెలలు దాటింది.ఇన్నాళ్ళు నొప్పులకి మందు వాడకూడదంట.సరె ఒక రొజు నా బాధ భరించలేక  పెద్ద హాస్పిటల్ కి తీసికెళ్ళాడుమా బాబాయ్.
వాళ్ళు చెప్పిందేమంటే జరిగిన ఆపరేషన్ సరిగా జరగలేదని,మళ్ళీ చేయాలనీఅన్నారు..
సరే రెండో ఆపరేషన్ లో తొడ ఎముకలో ఒక ముక్క కోసారు..
మా ఆవిడ ఏడుస్తోంది.ఏడవకే అని ఎంత చెప్పినా ఆగట్లా.నా నొప్పీ తగ్గట్లా.
అమ్మా నాన్న ఎక్కడున్నారు అడిగాను.నాకేం తెలుసు అన్నది.నువ్వే గదనే ఎళగొట్టింది.మీరు మాత్రం ఎళ్ళగొట్టలేదా నన్నొక్కదాన్నే అంటారు.అయినా ఎళ్ళ్లగొడితే ఎక్కడున్నారో తెలుస్తుందా ఏంటి.
పదవే ఎతుకుదాం అన్నాను.
రాత్రంతా అన్ని రోడ్లు ఫుట్పాథ్ లూ బస్టాండ్ లూ రైల్వే స్టేషన్లనీ వెతికారు. ఎట్లో అట్ల పట్టుకున్నారు ఓ గుళ్ళో పడుకుని వుంటే...
రావే అమ్మా నాన్నని తీసుకుని మనింటికి వెళ్దాం అన్నాను.
ఇప్పుడు నొప్పి చాలా నయమయింది.

Sunday, November 8, 2015

బజారు కని పంపించా స్నాచింగ్ ..

బజారు కని పంపించా.
 ఇంతవరకు రాలేదు .
బయటకొచ్చి చూస్తోంది నరసమ్మ.
 ఏవరు కలిస్తే ఎవరితో కబుర్లలో పడ్డాడో ఏమో ఈ మనిషి అనుకుంటు తనలో తనే
మట్లాడుకుంది.
ఇంతలో మూల మీద కనిపించాడు.
హమ్మయ్య అనుకుంది.కానీ అదేంటో ,కుంటుతూ వస్తున్నాడు.కాస్త దెబ్బలు
తగిలినట్లున్నాయి.
ఆదుర్దాగా ఎదురెళ్ళింది.
ఏంటండీ ఈ బట్టలనిండా మట్టి ఏంటి?
 నేను షాపు కెళ్ళ మన్నాగా ?
ఎక్కడి కెళ్ళి వస్తున్నారు.?అన్నది.
స్టేషన్ కెళ్ళి వస్తున్నా అన్నాడు.
అదేంటి రైల్వే స్టేషనుకా ?
మనవాళ్ళెవరూ వచ్చేవాళ్ళు లేరే ఎందుకెళ్ళారు ?అన్నది.
ఆ స్టేషన్ కి కాదే పోలీసు స్టేషన్ కి.అన్నాడు.
ఏందుకు?అన్నది భయంగా.
కంప్లైంటు,, కంప్లైంట్ ఇవ్వడానికి.
ఎందుకు ?అడిగింది.
షాపుకెళ్ళానా?
వచ్చేటప్పుడు
వచ్చేటప్పుడు కవరు చేతిలో పట్టుకొస్తున్నానా?
ఎవడో రానే వచ్చాడు వెనుక నుండి.
స్నాచింగ్ చేసాడు.
అదేంటండీ మీ మెళ్ళో గొలుసు గట్రా లెవ్వుగా?
ఆది కాదే కవరు కవర్ని స్నాచింగ్ చేసాడు.
అందులో కంది పప్పు ఉందే. నువ్వు తెమ్మన్నావుగా?