Wednesday, June 27, 2012

లేటు లేటు లేటై o ది.

ఎంటే మీరు కూడా వచ్చేసారు అన్నది అశ్చ్యర్యం  గా స్వర్గంలో  ఉన్న బామ్మ  .
కూతురిని మనమ రాలిని  చూసి ముందు సంతోషించి వెంటనే బాధ పడిపోతూ 'ఎందుకే నాతో  కూడా వచ్చేసారు.మీకేం తొందర వచ్చింది అని కోప్పడింది.
అది కాదు అమ్మా  అని కూతురు చెప్పబోతే మనమ రాలు 'నేను చెప్తా  బామ్మా అని మొదలెట్టింది.
బామ్మా నువ్వు నిన్న సాయంత్రం పోయ్యావని  మాకు కబురొచ్చింది
.మేమేమో సూరత్ లో ఉన్నాం.అక్కడి నుండి వచ్చేసరికి నిన్ను ఉంచు తారో  లేదో ,
ఆఖరి చూపు అందుతుం దో  లేదో అని డౌ టు  వచ్చింది.
 ఫ్లయిట్  లో వద్దామం టె  అక్కడ ఎఇర్ పోర్ట్ లేదు.
అందుకని ముందు బాంబే కి ట్రెయిన్  లో వచ్చాం.
అక్కడి నుండి ఫ్లయిట్  లో పొద్దున్న ఎనిమిది గంటలకి హైదరా బాదు  చేరాం .
ఇక శంషా  బాద్ లో ట్యాక్ సీ  మాట్లాడుకున్నాం.
డ్రైవర్ జాగ్రత్తగా నెమ్మదిగా మమ్మల్ని ఇంటికి తీసుకు వస్తున్నాడు.
అమ్మకేమో కంగారు.నిన్ను చూస్తామో లేదో అని ఒకటే గోల ఏడుపు.
డ్రైవర్ ని తొందర పెట్టింది.
బాగ  సతాయించి నానా గోల పెట్టింది.
లేటు లేటు లేటు లేటై  o ది  అని.
ఆ  కంగారులో డ్రైవర్ డివైడర్  ని కొట్టి కారు పల్టీ  కొట్టించా డు .
ముగ్గురం వచ్చేసాం .
డ్రైవర్ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటాడు.
మీ లేటు   కాలిపోనూ  అన్నది బామ్మ .
ఇంకేముంది అంతా కా లే పోయ్యాం 
ఇప్పుడు మన అందరి పేర్ల కి ముందు లేటు అని పెడతారు  అన్నది మనమ రాలు.

Tuesday, June 26, 2012

సినిమాల లో .........

 చాల రోజులైంది నిన్ను చూసి .భలే కలిసాం.అంతా  ఓ కే కదా.
హోటల్ లో కుర్చుని మాట్లాడుకుందాం  రా అన్నాను రఘు తో..
రఘు నేను టి త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం.
నేను సీరియల్స్ ,కొన్ని సినిమాల లో చాల చిన్న పాత్రలు  వేస్తున్నానని చెప్పాను.
త్వరలో నాకో పెద్ద క్యారెక్టర్ కూడా ఇవ్వ బోతున్నారు అని చెప్పాను .
నీ కె ట్ల  అయింది .ఎవరు చాన్సు ఇచ్చారు ?
 మొత్తానికి భలే సాధించావు  అన్నాడు రఘు.
అవును ఇది నా అదృష్టమే అన్నాను.
అవును కాని ఎట్లా  ఎట్లా ఎంటర్ అయ్యావు? అడిగాడు రఘు.
నాకు ఓపిక లేక పోయినా  తెచ్చుకుని మాట్లాడాను .ఎంతైనా నా చిన్న నాటి ఫ్రెండు కదా అని.
ఒక డైరెక్టర్ గారు ఉన్నారు.
నేను వాళ్ళ అమ్మాయికి  ట్యూషన్ చెప్పాను.అదీ  ఎవరో ఒక వ్యక్తీ ద్వారా కుదిరింది .. రోజూ  వాళ్ళింటికి వెళ్లే  వాడిని .ఒకరోజు  డైరెక్టర్ గారు నన్ను అడిగారు.ఒక చిన్న రోల్ ఉంది చేస్తావా  అని.ఇంకేంటి నా పంట పండింది అను 
కున్నా.అసలే నా చిన్నప్పటి కోరిక కదా.
ఇక ఆ రోజు షూటింగ్ లో ఒక చిన్న డైలాగ్ కూడా ఉంది.బ్రహ్మాడంగా చెప్పాననుకో.
ఇంకేముంది ఎంటర్ అయి పోయ్యా .విషయం మా వాడికి చెప్పాను.
సరే సరే నాకు కూడా కొంచెం పరిచయం చెయ్యవా   అన్నాడు రఘు.
ఏమని చెయ్యాలి అడిగాను.
నేను కూడా ట్యూ  షన్  చెప్తా నని చెప్పు  ప్లీజ్ ప్లీజ్ అన్నాడు.
సరే అని ఫోను తీసాను .నాకున్న పరిచయంతో మాట్లాడి విషయం చెప్పాను డైరెక్టర్ గారి మిసెస్ కి,వాడి ఫోను నెంబర్ కుడా ఇచ్చాను.
ఎటూ  ఇప్పుడు నేను సరిగ్గా వెళ్ళలేక పోతున్నా  కాబట్టి.
ఫోను చేసాక రఘు నా  ఫోను చేతిలోకి తీసికొని కాసేపు చూసి మళ్ళి  నాకిచ్చేసాడు.
డైరెక్టర్ గారు ఉళ్ళో  ఉండరు. ఎప్పుడు ఏదో షూటింగ్ కాని  ఎక్కడెక్కడో ఉంటారు అని చెప్పాను .
అయితే ఎక్కువగా ఇంట్లో ఉం డరన్న  మా ట . అన్నా డు  రఘు.
అవును అన్నాను.
సరే చాలా  టైం  అయింది అను కొని  ఇద్దరం ఎవరి దారిన వాళ్ళం వచ్చేసాం.
అర్థరాత్రి నాకు డైరెక్టర్ గారి నుండి ఫోను.వాళ్ళ వైఫ్ కి వచ్చిన మెసేజ్ ల గురించి
You,  the one I want,  I need, .  I want to say that I LOVE U!



Words are not enough to express just how much I love you. : you are the air I breathe, 


my heart belongs to you. Goodnight baby.
ఈ మెసేజ్ లన్నీ డైరెక్టర్ గారి మిసెస్ కి వచ్చిన య్ .నెంబరు మాత్రం మా వాడిదే.మా వాడి  నిర్వాకం అది.
నా చాన్సు లన్నీ  పోయినయ్ .