Friday, October 31, 2014

భూ లోక స్వర్గం

సంగీత సేవే కాదు
తుఫాను బాధితుల ఆరా కూడా .
ఓ నీటి బొట్టంతైనా నెత్తిన పెట్టుకున్న
బాల చంద్రుడి గురించి
ఏమని వర్ణించాలో
 ఎవ్వరినడగాలి ?
అలసిపోయిన సమయంలో కూడా
చమటోడ్చి చేసిన  సహాయం.
మచ్చలేని మనిషి చేసినది
స్వచ్చమైనదన్నదే ఇక్కడ ముచ్చటైన
విషయం.

Tuesday, October 28, 2014

భూలోక స్వర్గం.

పులకింతకి పందెం
మీ పాట మీరూ నేనూ కలిసి వినాలి
మది ఇంత పులకిస్తుందా?
అని మీకు అనిపిస్తుంది
ఆశ్చ్యర్యమే లేదు  అవుననే అనిపిస్తుంది
నేను మీ వైపు చూడాలి
అదేదో నేను మీ అంత వాడినైపోయినంత ఆనందం
ఒప్పుకుంటారా ?
ఎంత బాగుంటుందో
లేక పందెం నుండి తప్పుకుంటారా?
అందమైన లోకం అంటే
అదేదో అనుకున్నా
కానీ అది మీ
మధురమైన సంగీతం
మనసు ఆపుకోలేక
కలిసి విందామని
అదే నాకు విందని.

Monday, October 27, 2014

చలి చల్లగ మెల్లగా

చలి చల్లగ మెల్లగా నులిమేస్తోంది .
అది ఎత్తైన ప్రదేశం.
బండి ,అదే బైకు దిగి నడిపిస్తున్నా.
ఇంతలో బండి మీద వెనుక నుండి ఎవరో చెయ్యి వేసి సాయం చెయ్యాడానికని నెడుతూ ఉన్నాడు.
గట్టు ఎక్కాను.
నాకు శ్రమ  లేకుండా చేసాననుకున్నాడు.
ఇంతకు కొంచెం ముందే చలిలో బయటకొచ్చి  వణికి పోతూ
ఎందుకు బయటకి వచ్చానా అని విసిగిపోతూ ,
వంకర్లు తిరిగి పోతూ ఆగి నిలబడి అగ్గి పుల్లతో మంట వేసుకోవాలని ఆశగా చూసాను.
అది ఎవరూ కనిపించని సమయం అనుకున్నది కాలేదు.
ఆఖరి క్షణమే అనుకున్నంత  భయం.
వేడి కోసం ఎత్తు మీదకి బండి ఎక్కించాలనుకున్నానే గానీ ఇలా నెట్టించుకోవాలునుకున్నా నా?
వేడి వీడి పోయింది .
నా చలి మళ్ళీ బలపడింది. 

Wednesday, October 22, 2014

సరే పెద్ద వాళ్ళు,,,, అడిగారు

ఆయన,, మురళి  జాబ్ మారుతున్నాడు.ఇంకా దొరక లేదు.నేనూ అంతే అదే పరిస్థితి.కూర్చుని తింటే ఎన్నాళ్ళు తింటాం. మా సేవింగ్స్ అన్నీ అయిపోవస్తున్నాయి.ఇంటి దగ్గర మా పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి రోగాలూ అవీ ఇవీ అన్నీ కలిపి అంతా ఖర్చే ఖర్చు.

ఆలోచనలతో కూర్చున్నా.ఇంతలో పక్కన కాంతమ్మ్మ వచ్చింది.అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది.అవీ ఇవీ కబుర్లు మోసుకొస్తుంటుంది.విన్నా వినకపోయినా చెప్పటం ఆమెకు అలవాటు.భార్యా భర్త ఇద్దరే ఉంటారు.పిల్లలు ఉద్యోగాల్లో ఎక్కడివాళ్ళు అక్కడే ఇంక చెప్పేదేముంది.వీళ్ళు దాచుకున్నవి వీళ్ళకి సరిపోను కాస్తో కూస్తో మిగులుస్తుంటారు.
ఇంతలో కాంతమ్మ భర్త అప్పారావు గారు కూడా ఊడిపడ్డారు.
'ఏమ్మా బాగున్నావా' అన్నారు.అన్నట్లు నువ్వొక పని చేసి పెట్టాలి.
'ఏంటదీఅడిగా.
రేపు కొంచెం నీ కారులో మా ఇద్దరినీ మా వాళ్ళింటికి తీసికెళ్ళాలి
ఓ నలభై కిలో మీటర్లు  .డబ్బులు నేనిస్తాను.వద్దంటే కుదరదు 'అన్నాడు.
ఈ మధ్య మేము కారు కూడా వాడట్లేదు.సరే పెద్ద వాళ్ళు అడిగారు కాబట్టి కాదనలేక పోయా.డబ్బుల కోసం కాదు.
పొద్దున్నే బయలుదేరాం.అక్కడికెళ్ళాక అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ లేటే అయింది.
తిరిగి వచ్చే దారిలో అప్పారావు గారు చాలా సంతోషంతో 'చాలా జాగ్రత్తగా తీసుకొచ్చావమ్మా చచ్చి నీ కడుపున పుడతా అంటూ పొగడ్తల తో ముంచెత్తాడు.
సరే నెమ్మదిగా వాళ్ళ ఇంటి ముందు ఆపా.ఇద్దరూ దిగారు.
నేను మా ఇంటి ముందు కారు పెట్టడానికి కారు స్టార్ట్ చేస్తుండగా అప్పారావు  గారు నా దగ్గరగా వచ్చి వంగి 'అమ్మా ఇంకో సారి అవసరమైతే పెట్రోలుకి నేనే డబ్బులిస్తా' అన్నారు.సరే ఫరవాలేదండీ అని ముందుకొచ్చాను.

Wednesday, October 15, 2014

తుఫాను

తుఫాను లో చావనివ్వరూ పునరావాస కేంద్రాలలో (షెల్టర్లలో)బ్రతకనివ్వరు.


Neither allow to die in cyclone nor allow to survive in rehabilitation centres.

Saturday, October 11, 2014

రోడ్డు మధ్యలొ

ఆమె రోడ్డు మధ్యలొ నడుస్తొంది.
రోడ్డు మధ్యలో నడుస్తోంది మూర్ఖురాలు అనుకొని హారన్ కొట్టకుండా రైట్ నుండి  వెళ్ళా.
రైట్ కి స్టెప్ వేసింది.నా బండి తగిలింది.'ఏంటి కనబడట్లేదా అన్నది.''మరి మీరు రోడ్డు మధ్యలో నడుస్తున్నారు కదా అక్కడే అట్లే నడుస్తారనుకున్నా అన్నాను.'
'హారన్ కొట్టాలని తెలియదా?' అన్నది.
తరువాత రొజు మళ్ళీ రోడ్డు మధ్యలో కనబడింది.
ఈ సారి హారన్ కొ డుతూ వెళ్ళా రైట్ లో.
మళ్ళీ రైట్ కి స్టెప్ వేసింది.బండి తగిలింది.
'ఏంటిది మధ్యలోనే ఉంటారని హరన్ కొడితే పక్కకొచ్చి ఇట్లా చెయ్యడమేంటీ అని నేను అరిచా.
'హారన్ కొడితే పక్కకి రాకుండా ఎక్కడికి పోతారయ్యా రోడ్డు మధ్యలో నడుస్తారా?' అని తిరిగి అరిచింది.
అంటే ఏం చెయ్యాలి? అర్థం కావట్లా నాకు.
హారన్ కొడుతూ,, ఆమె మధ్యలోనే ఉంటుందా లేకపోతే ప్రక్కకి వస్తుందా అని అమ్మగార్ని చూసి ఆగి పోవాలి కాబోలు అనుకున్నా.