Saturday, November 23, 2013

అతి జాగ్రత్త

ఆంటీ, ఆంటీ ఏంటి  పొద్దున్నే ఫోన్ చేసారు.అసలు హాస్పిటల్ కి ఎందుకొచ్చారు. అంకుల్  కి ఏమైంది."" అడిగారు పిల్లలు ఆదుర్దాగా హాస్పిటల్ కి వచ్చి....................................................................................................................................................................................
ఏం లేదు బాబూ ఈ మధ్య హెల్థ్ చానెల్స్ బాగా చూస్తున్నారు.వాటిల్లో చెప్పేవి అన్నీ మంచి విషయాలే .అయితే మరీ అతిగా ఆరోగ్యం గురించి జాగ్రత్త పడితే ఇదిగో ఇట్లాగే ఉంటుంది.
అసలు ఏమైంది ఆంటీ.
టీ మూడు సార్లు రోజుకి తాగితే కాన్సర్ రాదని టీ వీ లో చూసారు.అప్పటి నుండి టీ త్రాగడం మొదలెట్టారు.అంతకుముందు పాలే త్రాగేవారు.
మళ్ళీ  తరవాత ఇంకో రోజు  టీ వీ లో ,,కాఫీ త్రాగే వాళ్ళకి టైప్ టూ షుగర్ రాదని
చెప్తే కాఫీ కూడా త్రాగడం మొదలు పెట్టారు.
రెండూ వద్దండీ ఏదో ఒకటి త్రాగండి అన్నాను.కోపమొచ్చింది.
""అంటే నాకు కాన్సరో షుగరో రావాలనే కదా నీ కోరిక"" అని నా
మీద విరుచుకు పడ్డారు.
సరే ఏం చేస్తాం కర్మ అనుకొని వదిలేసాను.
ఇంట్లో రోజూ కాఫీలు  టీలు బాగ బిందెలు బిందెలు తాగి ఇట్లా హాస్పిటల్ లో పడ్డారు.""అన్నది.
 

Monday, November 18, 2013

ఫిల్మ్ తియ్యాలని తెలియదా?

స్టాప్ స్టాప్ అని వినబడింది.
వెంటనే ఆపేశాడు రాజు .
ఫిల్మ్ తియ్యాలని తెలియదా?
ఎన్నాళ్ళయింది సుప్రీం కోర్ట్ చెప్పి.
కోర్టుల మాటంటే అంత చీపై పోయిందా మీకు.""ఆవేశంగా అడిగాడు ఆ వ్యక్తి.
""నాది కారు కాదండీ,బైకు.ఇది హెల్మెట్.మీరు ఫిల్మూ అదీ అంటే నాకు అర్థం కావట్లేదు.""""అన్నాడు రాజు.
హెల్మెట్ అయినా సరే .బ్లాక్ గ్లాస్ ఉంది.నీ మొహం కనబడట్లేదు.ఇట్లా కనబడక పోతే నేరాలు జరిగే అవకాశం చాలా ఉంది.అన్నాడు ఆ వ్యక్తి.
నా.......... మొహం !!!!
.ఉట్టి మొహమే కదా కనబడట్లేదు.మొహంతో ఏం నేరం చేస్తా నేను"" అన్నాడు రాజు.
ఇట్లాంటి కబుర్లు చెప్పి నన్ను మోసం చెయ్యకు.మొహంతో అనేక నేరాలు చెయ్యొచ్చు.
నీ కళ్ళతో షార్ప్ గా ఎవర్నైనా చుసి,అదీ అమ్మాయిల్ని చూసి గాయ పరచొచ్చు.
అంతే గాదు
నోటి తో నేరం చెయ్యొచ్చు.""అన్నాడు.
నోటితో లోపల్లోపల ఏం చేస్తా చెప్పండి""అన్నాడు రాజు.
అదే ,మరి .ఎటకారం అంటే.నోటి తో అసభ్యంగా ఇకిలించొచ్చు అదీ స్థ్రీలని చూస్తూ."అన్నాడు
నేనికిలించినా వాళ్ళకి కనబడదు గద్సారూ.వాళ్ళకీ తెలియదు కదా"అన్నాడు రాజు.
అదే... మరి..... మాకు......... మాకు తెలియాలి . తలకాయ ఊపి పిలుస్తావు.అడిగితే నే నూపలేదూ హెల్మెట్ ఊగింది అంటావ్."" అన్నాడు ఆ వ్యక్తి.
సరే ఇంతకీ ఏం చెయ్యాలి చెప్పండి.మా ఇంటి అద్దాలూ,మా షాపు అద్దాలూ కూడా బ్లాక్ గ నే ఉన్నాయ్.అవి కూడా తీసెయ్యమంటారా?అన్నాడు రాజు.
అదిగో మళ్ళీ ఎటకారం.అదే వొద్దు.అన్నాడు ఆ వ్యక్తి.
సరే ఏం చెయ్యమంటారు ఇప్పుడు"" అడిగాడు రాజు.
ఎంతో కొంతియ్.""అన్నాడు.
అసలిచ్చే పనేంటి.""అన్నాడు రాజు.
ఏదో చూడ్రాదూ .ఫ్యామిలీ ఉందిలే.""అన్నాడు.


Friday, November 15, 2013

దేవుడ్ని ప్రార్థిస్తా

"""" మెడికల్ షాపు లో అమ్మే మందులు డూప్లికేట్ చాలా వస్తున్నాయి"""."అన్నాడు  హాస్పిటల్ లో డాక్టర్ చాంబర్లో ఓ పేషెంట్.
"""""మీకేదైనా అట్ల జరిగిందా"""" "అడిగాడు రాజు.
""""జరగడమేంటి.మా ఆవిడకి ఆరు నెలలుగా ,,,,,, మందులు వాడుతున్నాం.తగ్గట్లా. ఈ డాక్టర్ గారి దగ్గరికొచ్చి  అడిగాం .ఆ మందు టెస్ట్ కి పంపించారు.అవి డూప్లికేట్ అని తెలిసింది."""""అన్నాడు.
"""""అయ్యో""""" అన్నాడు రాజు.
""""ఈ అవినీతి అక్రమాలు భరించలేకే నేను ఏ మందూ వాడను"""" అక్కడే ఉన్న  డాక్టర్ అన్నాడు.
""""అదేంటి .వాడక పోతే ఎట్లా?"""" " అన్నాడు ఎదురుగా కూర్చున్న రాజు.
"""""అంతే.నే వాడను.నేను దేవుడ్ని ప్రార్థిస్తా.అంతే.ఇవన్నీ చూసి అట్లా మారి పొయ్యా.""""
"""అయ్యో! అయ్యో! '"""రాజు మరింత కృంగి పొయ్యాడు..పాపం అనిపించింది.జాలేసింది.ఈ దుర్మార్గుల్ని,,
డుప్లికేట్ మందులు తయారు చేసే వారిని కట్టడి చేసే వారే లేరా అనుకున్నాడు రాజు.
 ఆ సాయంత్రం రాజు హాస్పిటల్ దగ్గర్లో మరో మెడికల్ షాపు కి వెళ్ళాడు .
హాస్పిటల్ లో ఉదయం కనిపించిన డాక్టర్ కనబడ్డాడు. రాజు ని గుర్తు పట్టలేదు.
""""ఆ కంపెనీ స్టాక్ పెట్టుకోవయ్యా""""" మెడికల్ షాపు వ్యక్తికి చెప్తున్నాడు.""""అవన్నీ తొందరగ అవ్వగొట్టే పూచీ నాది.ప్రతి పేషెంట్ కి ఈ మందు రాయొచ్చు. స్టాక్ అయిపోంగనే నాకు ఫిఫ్టీ పర్సెంట్""""" ." అన్నాడు.


Wednesday, October 30, 2013

అమ్మ తోడు ఒక్కడ్ని ఒదిలిపెడితే ఒట్టు.

అమ్మ తోడు ఒక్కడ్ని ఒదిలిపెడితే ఒట్టు.
అడ్డొచ్చినోడ్ని అడ్డంగ నరికేస్తా.
 నేను నరకడం మొదలు పెడితే,నరకానికి హౌజ్ ఫుల్ బోర్డు పెడతారు. ఒక్కడైనా ఇక్కడి నుండి తప్పించుకుంటే నేనసలు ఒక అబ్బకే పుట్టలేదు.
శత్రువు తప్పించుకోకుండా గడి పెడదామనుకున్నాడు గానీ అక్కడ తలుపులు లేవు.
తెగ రెచ్చిపోతున్నాడు మా వాడు. మా పిన్ని కి చెప్పా .వాడ్ని ఎక్కువగ సినిమాలకి పంపించొద్దని.నా మాట వింటేగా.
ఎదురుగ పదిమంది ఉన్నారు.ఇటు మావాడొక్కడే.
ఈ సినిమా ఏమవుతుందో ,ఎట్లా ఎండ్ అవుతుందో అన్న టెన్షన్ నాకు.
ఇంకా ఇంకా పేల్తునే ఉన్నాడు.
గతంలో కూడా సినిమాల మోటివేషన్ తో రెచ్చిపోయ్యాడు.
మున్సిపల్ పంపు ని కాల్తో ఈడ్చి కొట్టాడు.నీళ్ళు చిమ్మిచ్చి కొడతయ్యనుకున్నాడు.శత్రువు భయపడి పోతాడనుకున్నాడు.కానీ      వీడి    రక్తం చిమ్మించి కొట్టింది.హాస్పిటల్ లో చేర్చాం.బిల్లు పది వేలైంది.
మళ్ళీ ఇంకోసారి గోడని ఈడ్చి గుద్దాడు.గోడ ఇరుగుతుందనుకున్నాడు.కానీ చెయ్యి విరిగింది.
మాకసలు ఏంటి వీడితో ????.రోజూ ఇదే గొడవ.ఈ సినిమాలు తీసే డైరెక్టర్లకి ,నిర్మాతలకి
ఒక రిక్వెస్ట్ లేఖ ఇచ్చుకుంటే బాగని పిస్తోంది.
ఆ హీరోలు చాలా ఈజీ గ చేసేస్తున్నారు ఫైటింగులు.వాళ్ళలొని శక్తి చూస్తే ముచ్చటేస్తుంది.వాళ్ళు మనుష్యులు కారేమో.దైవ శక్తులు సంపాదించుకున్న దివ్య పురుషులు .ఫిల్మ్ నగర్ వాసులు.కానీ మావాడికి ఆ శక్తులు అబ్బక ,ఉన్న శక్తి అచ్చి రాక ఆస్పత్రి పాలవుతున్నాడు.

సజీవ దహనం-ఎప్పటికీ మిస్సింగ్ కేసు.

ఫోన్ రింగ్ అవుతోంది.
శేఖర్ లిఫ్ట్ చేశాడు.
''''''సార్ రవి ఫాదరా మీరూ అన్నాడు అవతలి వ్యక్తి.'''''
అవును అన్నాడు శేఖర్.
''''సార్ నాకు ఓ ఫ్రెండ్ ఇచ్చాడు మీ నంబరు.
రవీ నేను చాల రోజులు ఒకే ఆఫీసులో పని చేశాం.ఆ రోజులని చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం.చాలా సంవత్సరాలు అయిపోయినయ్.రవి ని చూడాలని ఉంది.అందుకే మీకు ఫోన్ చేశా''''
అన్నాడు అవతలి వ్యక్తి.
'చాలా సంతోషం బాబు.కానీ రవి ఇప్పుడు ఇక్కడ లేడు .చెన్నై లో జాబ్ చేస్తున్నాడు.
నీకు నంబర్ ఇస్తాను.మాట్లాడు.లేదా హైద్రాబాద్ వచ్చినప్పుడు నీకు ఇదే నంబరు కి ఫోన్ చేస్తాను .వచ్చి కలవొచ్చు.సరెనా?' అన్నాడు శేఖర్..
''''సరె సార్ అన్నాడు అవతలి వ్యక్తి.""ఫోన్ పెట్టేశాడు.
మీ దృష్టి లో రవి చెన్నై లోనే ఉంటాడు. కొన్నాళ్ళకి మీరు రవి మిస్సింగ్ అని ప్రకటన కూడా ఇస్తారు పేపర్లలో ,టీవీలలో.
అసలు విషయం మీకు తెలియదు.
రవి చెన్నై నుండి బెంగుళూరు వెళ్ళాడు.అక్కడి నుండి మిమ్మల్ని చూడడానికి హైదరాబాదు బయలుదేరాడు వోల్వో బస్సు లో .అందులో నలభై ఆరు మంది సజీవ దహనం అయిపొయ్యారు.
మీకు రవి ఫోన్ చేసి చెప్పలేదు తను ఎక్కడెక్కడికి వెళ్ళ్తున్నదీ.
అందుకే అతను ఎప్పటికీ మిస్సింగ్ కేసుగ నే మిగిలిపోతాడు. .
ఎక్కడికి వెళ్తున్నదీ ఎప్పుడు మీ వాళ్ళకి చెప్తూ ఉండండి.

Saturday, September 7, 2013

సరె,,ఎంతిస్తావ్?

ఎనక నుండి ఆర్ టీ సీ ,తెలుసు గదా వాళ్ళ టాలెంట్,యమ స్పీడు గ వస్తోంది,అంత కన్న కేర్లెస్సోళ్ళు ఎవ్వరు లేరు.ఏంటో వాళ్ళ ధైర్యం గానీ. సరె,అందుకే నేను సిగ్నల్ జంప్ .ఈ ఒక్కసారి వదిలెయ్యండి. మొన్న ఖైరతా బాదు లో ఏమైంది! పాపం ఒక ఆడపిల్ల ,రెడ్ సిగ్నల్ కి  సిన్సియర్ గ ఆగిపోయింది ఎనక నుండి ఆర్ టీ సీ తొక్కేసింది.స్పాట్.
సరె ఎంతిస్తావ్? అడిగాడు,
ఇదిగో ఇంతిస్తాను అన్నా,
అప్పుడు ఆ రేటుకి ఆ రేటు,మరి ఇప్పుడు ఈ పెరిగిన రేటుకి ?అన్నాడు
అయినా సరే .నేనివ్వను.
అదిగో మళ్ళి అదే పరాచకం.ఇంతకుముందు రేట్ల ప్రకారం అది సరిపోద్ది .ఇప్పుడు రేట్లు పెరగలా?
అయినా సరే .నా వల్ల కాదు.అన్నాను
కీ స్ ఇవ్వను.నీ బండి ఇవ్వను.ఏం చేసుకుంటావో చేసుకో, పో అన్నాడు.
అంతేనా ??అంతేనా ??నాకొద్దు పో .అసలు ఈ బండే వద్దు.నీ కిచ్చే డబ్బుల్తో ఎంచక్కా
కొత్త బండే కొనుక్కుంటా.

Tuesday, September 3, 2013

అదే ఈన ఎక్సర్ సైజ్.


కాంతం, రమణమ్మా, పార్వతీ,సుగుణా అందరూ వచ్చారానే? వచ్చారుగా.! రండి రండి కూర్చోండి. అవునూ మనం రోజుకో విషయం మాట్లాడుతున్నాం. ఈ రోజు మన హజ్బెండ్ ల బరువు,,పొట్టలు గురించి మాట్లాడుకుందాం. మా హజ్బెండ్ ఈ వారం మొదలు పెట్టాడు.పార్క్ లో నాలుగు రౌండ్లు నడుస్తున్నాడు అన్నది కాంతం.

మా హజ్బెండ్ ఇంట్లో నే వంగుతాడు లేస్తాడు.ఇదేం ఎక్సర్ సైజ్ అని నేనడిగితే అదంతే అట్లా చేస్తే బోలెడన్ని కేలరీలు బర్న్ అయిపోతయ్ అని ఎవరో చెప్పారని చెప్తాడు. అన్నది రమణమ్మ.


పార్వతి మాట్లాడుతు మా ఆయన............ "పైకీ కిందికీ నడుం ఊపుతున్నానుగా అది చాలు అంటారు.రోజూ  లేదుగా  ,,వారానికోసారి ,,అదేం సరి పోతుందని నెనంటా. సరె గాప్ తగ్గిస్తాలే అంటారు .అనడమే గానీ అది జరిగేది కాదు పెట్టేది కాదు.

అదె సరే !సుగుణా ,,నువ్వు చెప్పవే మీ హజ్బెండ్ గురించి మేమంతా చెప్పాం. సరె చెప్తున్నా వినండి అన్నది సుగుణ. ఈన  అదే మా ఆయనమీవాళ్ళ లా కాదు , అట్లా కొంచెం ముందుకి నడుస్తారు.ఒక కాలు లేపుతారు కాలు ఇంకో పక్క పెట్టి రెండు సార్లు కాలు విదిలిస్తారు.ఒక్కోసారి నాలుగైదు సార్లు కూడా విదిలిస్తారు. కాళ్ళు రెండూ పైకి పెడతారు.అప్పుడప్పుడు ఒక కాలు కింద పెడుతూ ఉంటారు.వేళ్ళు ముడుస్తారు తెరుస్తారు.అట్ల చాల సార్లు చేస్తునే ఉంటారు.ఇదంతా పొద్దున. మళ్ళీ సాయంత్రం ఒకసారి ఇదే పని .ఇది సరి పోదండీ అంటా నేను. ఇదే ఎక్కువా అంటారు ఆయన.అదే ఈన ఎక్సర్సైజ్.  అదే,, బైక్    మీద ఆఫీసు కి వెళ్ళడం రావడం  అన్నది.

Sunday, January 27, 2013

కొట్టూ, గుద్దూ, వాడ్ని చంపెయ్యండి

కొట్టూ, గుద్దూ, వాడ్ని చంపెయ్యండి.గుంపు లో నుండి మాటలు.
నరికెయ్యండి. ఇంకొకడు.
దయచేసి నా మాట వినండి.వేడుకుంటున్నాడు దెబ్బలు తినే ఓ వ్యక్తి.
కానీ ఎవరూ వినడంలా అతని మాటలు.
దెబ్బ మీద దెబ్బ పడుతునే ఉన్నాయి.
అక్కడో చిన్న అమ్మాయి.తలకి గాయం.రక్తం.
మరండీ ' ఒకడు మొదలు పెట్టాడు.
అరవై కిలోమీటర్ల స్పీడుతో చెప్పబోయాడు ఒక పెద్ద మనిషి..,,,,,,
అరయై లో వస్తున్నాడా?అమ్మో ! అసలు ఈ రోడ్డులో ఇరవయ్యే ఎక్కువ.
వెయ్యండి " వాడ్ని ఏం చేసినా పాపం లేదు.
 మళ్ళీ ,,చెప్పబోయాడు ఆ పెద్ద మనిషి.
అరవయ్యంటే ,,,,,,,,,అరవై ఆయన స్పీడు గాదండీ ,మళ్ళీ చెప్పే ప్రయత్నం,ఆ పెద్ద మనిషి.
ఇంక నువ్వేం చెప్పఖ్ఖర్లేదయ్యా.వీడు కారు మీద అరవై స్పీడులో వస్తున్నాడు.వచ్చి ఆ అమ్మాయిని గుద్దాడు అంతే కదా అన్నాడు ఒక ఫైటర్.
అక్కడే మీరు పొరబాటు పడుతున్నారు అంటూ పెద్ద మనిషి మళ్ళీ చెప్పాడు.
ఆ అమ్మాయే ఆగివున్న కారుని అరవై కిలోమీటర్ల స్పీడు లో వచ్చి వెనక్కి చూస్తూ రోడ్డు మీద ఆడితూ  కారుని ఆమే గుద్ది పడిందండీ.

Thursday, January 24, 2013

ద సన్ ఆఫ్ హీరో.


మీకేనండీ వాడి గురించి అలోచించారా?
ఏంటి అలోచించేది .నీ మొహం.
వాడికి నిండా పదిహేనేళ్ళు లేవు.
నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావ్ అన్నాడు సీనియర్ హీరో గారు.
సపోర్ట్ కాదు.వాడు మీరెళ్ళాక చేసే గోల అంతా ఇంతా కాదు అన్నది భార్య.
కనీసం ఇంటరైనా పూర్తి అవ్వాలా అన్నాడు. ?
పొద్దుటి నుండి వాడు తలుపులు పగల గొడుతున్నాడు.
డ్రమ్ములో నీళ్ళన్నీ పారబోశాడు.
కారు పాడు చేశాడు.
డ్రెస్సింగ్ టేబిల్ పగల గొట్టాడు అన్నది..
కాస్త ఓర్చుకోమనవే .ఎట్లాగూ వాడు చదివి చచ్చేది
అంతంత మాత్రమే. ఆ మొహాన కాస్తంత నూగు మీసాలన్నా రానీవే.
అప్పుడు  హీరో అంటే కాస్తంత బాగుంటుంది.
లేక పోతే ఇప్పుడే వాణ్ణి సినిమాల్లోకి తెచ్చినందుకు అందరూ నా నోట్లో ఉమ్మేస్తారు.
చెప్పింది కాస్త వినాలి.
అసలు నా సినిమాలే ఆడక చస్తొంటే ఇదేం గోల?
వాడు హీరో అవ్వడానికి ఇంకా కొంచెం టైం తీసుకోవచ్చు.
మీ సినిమాల సంగతి అటుంచండి.అవన్నీ ఫ్లాపు లే అయినా మనకేం తక్కువ .
బోలెడంత డబ్బుంది. ఆ కాజలూ ,సమంతా పక్కన హీరో గా చెయ్యాలని ఉందంట

లేక పోతే వాళ్ళు పెద్దై పోతారు నాకు చాన్సు ఉండదు అంటాడు వాడు.
వాళ్ళు మళ్ళా దొరకరేమోనని వాడి బాధ.
వాళ్ళు పెద్దవడమేంటే నీ మొహం వాళ్ళు ఎప్పుడో పెద్దై పోయారు.
వీడాశ పాడుగానూ అన్నాడు హీరో గారు.!