Friday, July 13, 2012

స్పీ డు గా పోయి మద్యలో పెట్టాలి

చూసావా,, మా వాడి బైక్ .స్పోర్ట్స్ బైక్ .కలర్ ,ఎర్రటి ఎరుపు .మా వాడు .......... .ఆ షైనింగ్ లు చూడు.అన్నది తల్లి.
''డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?'' అడిగింది.పక్కింటి ఆమె.
''ఎందుకు ?నువ్వు మరీ  విచిత్రం.వాడు ,వాళ్ళ నాన్న పేరు చెబితే చాలదూ?వాడి లైసెన్సు అడగడం కాదు గదా వాడి వైపు కుడా చూ డరు  పోలీసులు.''
''అయితే జాగ్రత్త గా  నడుపుతాడా ?''
''అయ్యో ఈ రోజుల్లో పిల్లలకి మనం జాగ్రత్త చెప్పాలా,వాళ్ళే మనకి చెప్తారు. ''
''అసలు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు వాడు.ఎంత ముద్దొచ్చి చస్తున్నాడో! అన్నది తల్లి.''
''ఏరా ,అయిందా ?బయలుదేరదామా? అడిగింది తల్లి''..
.......................................................................................................................................................
.....................................................................................................................................................

'మమ్మీ, ,  ఆ బో ర్డ్  ఏం  టి  ''మీ వివాహమునకు మీరే  బాధ్యులు ''అని రాసారు.. అంటే ఏంటి మమ్మీ  ?అన్నాడు కొడుకు..
నీ  బొంద బోర్డు సరిగ్గా చదవ వు . నన్ను చంపుతావ్.
అది వివా హం కాదు  ''మీ వాహనము నకు మీ రే బాధ్యులు ''అయి ఉంటుంది .''''.అన్నది  వెనుక కూర్చున్న మమ్మీ..
''ఈగ  ''హిట్టు మమ్మీ  .''మేం వయసుకు వచ్చాం'' కొత్త సినిమా రిలీజ్''.......................................................పోస్టర్ లు చూ స్తూ,  చదువుతూ బండి నడుపుతున్నాడు.
బండి స్పీడు  పెంచాడు సడెన్ గా  .
''ఏంట్రా అంత స్పీ డు ''.
''ఏం  లేదు'',........ ''ఏం  లేదు సిగ్నలు మారుతోంది.గ్రీ న్  పోతోంది. అందుకే''.
''అయ్యో''
 .................................................................
........................................................................................................................................................

''మళ్లీ  ఏంట్రా ?ఈ స్పీ డు ''..
''రోడ్డు దాటాలి మమ్మీ  .
ఇక్కడ సిగ్నల్ ఉండదు.
స్పీ డు  గ పోనిచ్చి రోడ్డు మద్యలో పెట్టా లి అప్పుడు గాని క్రాస్స్  చెయ్యటం కుదరదు.ఎవరు ముందు పెడితే వాళ్ళే .
ఆయన ఎవరో చూ డు  ఎంత సేపట్నుం డి అక్కడే ఉన్నాడో ,
అట్లా అయితే తెల్లారుతుంది.
ధైర్యం ధైర్యం ,ఉండాలి మమ్మీ .
స్పీ డు  గా  పోయి మద్యలో పెట్టాలి .అప్పుడు గాని వీ ళ్ళ  రోగం కుదరదు.సిటీ  లో  అట్ల ఉంటే నే తప్ప బతకలేం.''.............................................................................................................................................................
...........................................................................................................................................................
''అయ్యో అయ్యో !చెప్తే వినలా ''
యా క్సి డెంట్ !
పడేసి చచ్చావ్ ''.
''నడిరోడ్డు మీ ద  పడేసావ్ .కాలు మళ్లి   విరిగింది.
ఇంతకుముందు విరిగినప్పుడే   డాక్టర్లు ఆపరేషన్ చేసారు.సక్సెస్ కాలేదు.
ఒక కాలు పొట్టి ఒక  కాలు పొడుగు. ఒక చెప్పు హైట్ ,ఒక చెప్పు డౌనూ .ఈ సారి ఇంకా   పొట్టి అయితుం దేమో . ఒక కాలు మోకాలు వరకు వస్తుందేమో''.

Thursday, July 12, 2012

కారు ని ఆపించాడు పోలీసు .


కారు ని ఆపించాడు పోలీసు .
గ్లా స్  దించి బయటకు చూ సాడు లాయర్   శర్మ.
లైసెన్సు, పొల్యూ షన్ ,ఆర్ సి ,ఇన్స్యురెంస్  తొందరగా తియ్యమన్నాడు కానిస్టేబుల్.
పొల్యూ షన్  లేదేంటి అడిగాడు కానిస్టేబుల్.
'శర్మ లాయర్  శర్మ 'అంటూ  సీ రియస్  గ చూసాడు లాయర్  శర్మ.
చెయ్యి ఊపి  వెళ్ళ మన్నాడు కానిస్టేబుల్.
బార్ లో కూర్చున్నారు  శర్మ అతని ఫ్రెండ్స్.
'నా కొద్దు.నే తీసుకోను .ఇంటి కెళ్ల డం ఇబ్బంది.అదీ కాక పోలీసు  చెకిం గ్స్ '.అన్నాడు ఫ్రెండు.
ఊరు కోవయ్యా ! ''లాయర్ శర్మ'' అను ఎవరన్న అడిగితే 'అన్నారు లాయర్.
బయటకు వచ్చి కారు తీయ బో యాడు శర్మ.
''రాంగ్  పార్కింగ్ .ఫైన్ పే చెయ్యాలి''. అడిగాడు కానిస్టేబుల్.
''అయ్యో శర్మ బాబూ  శర్మ లాయర్ శర్మని  నేను''.................................................
...........................................................................................................................
కారు లో శర్మ అండ్ ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నారు కబుర్లు  చెప్పుకుంటూ.
ఒక ఫ్రెండు మాత్రం బైక్ మీద  బయలు దేరాడు.
కాసేపటికి శర్మ కి ఫోను.
అటునుండి''బాబాయ్,బాబాయ్, పోలీసు  పట్టుకున్నాడు.డ్రింక్ డ్రైవ్ అంటున్నాడు."
''ఎక్కడున్నావ్ .........సరే సరే వస్తున్నా అక్కడే ఉండు'' .
శర్మ స్పాట్ కి చేరుకున్నాడు.ఫ్రెండు కి హెల్ప్ చెయ్యడానికి.
సేం  డైలాగ్ రిపీ ట్  చేసాడు.శర్మ.
''లాయర్ శర్మ వే , కాదన ట్లా .
రెస్పాన్స్ బుల్  సిటిజన్ వి కావా  నువ్వు?
దేశానికి సేవ ఎట్లాగు చేసే మొహం లా  లేదు నీ ది .
కనీసం రూల్స్ పాటించ వయ్యా  ప్లీ డ ర్  లాయరు మొగడా '' అన్నాడు కానిస్టేబుల్..


Friday, July 6, 2012

ఇంత అందంగా కూడా ఉంటారా??

మానింగ్ టైం ...కూల్ ..కూల్ గ క్లైమేట్ (వాతా వరణం).
పల్సా ర్  మీద  ఆశిష్..
విశాల మైన రోడ్డు..
అతిగా ఆలోచించ కుండా స్లో గా  బండి నడుపుతున్నాడు..
ఇంతలో ........................................
ఎవరో ఓవర్ టేక్  చేసారు..
అది స్కూ టీ ..
ముందొక అమ్మాయి డ్రైవ్ చేస్తోంది..
వెనుక ఒక ఆమె కూర్చుంది.
నమ్ము నమ్మకపో! .ఇదే ఫస్ట్  టైం !.ఇంత అందంగా కూడా ఉంటారా??
' అతిలోక సుందరి 'మనసులో..తనలో తను.. .........  ఆనందంలో ఆశిష్.
ఇంత ఫర్ఫెక్ట్టా......
 .'ఇంత పర్ఫెక్ట్  గ ఉన్న వాళ్ళు ఎక్కడో ఎక్కడో''
ఇట్లాంటి ,ఇంత అందమైన వాళ్ళు మన మధ్యనే ఉంటారా?"అశ్చ్యర్యం  లో ఆశిష్..
రంగు కి రంగు ,అందానికి అందం అన్నింటికి అన్నీ '
వెనుకాలే ఫాలో అవుతున్నాడు....
క్లోజ్ క్లోజ్ గా .
ఆమె ఫోన్ లో మాట్లా డు తోంది .వన్ సైడ్ కూర్చుంది..
వన్ సైడే  కనిపిస్తోంది..
స్త్ర్రె ట్  గ చూస్తే  ఎట్లా ఉంటుందో..అదే ఫ్రంట్ సైడు..
అటు కూ డా ఇదే అందమా ...లేక అందుకు భిన్న మా..(డిఫరెంట్))
ఎనీ  వే  కొంచెం ముందుకెళ్ళి చూ ద్దాం .((((((((((((((((((((((((((((((((((((ఇన్ ప్రోగ్రెస్)).
'నీ వు  నా  దా నివే..నేను నీ వాడినే..
చిలిపి నవ్వుల నిను చూడగానే
వలపు పొంగేను నా లో నా .......'
బాలు గా రి పా ట ని హం చేస్తున్నాడు ఆశిష్....
జీవితంలో ఇంతకన్నా ఆనంద ఘడియలు ఉంటాయా??
కొంచెం స్పీ డ్ ..ఇంకొంచెం స్పీ డ్ .....
నో సరిపోవట్ల .ఆ ఫేస్ ఫుల్ పిక్చర్ క్యాచ్ చెయ్యలేక పోతున్నాడు..
ఇంకొంచెం స్పీడ్ ......
అయిపోయింది ....అయిపోయింది .......చూసేస్తున్నా ......
అన్నం ఉడుకుతూ  మూత లేస్తున్నట్లు మ్యాన్ హోల్ మూ త లేస్తూ పడుతూ ఉంది..
 పచ్చని ప్లస్ చక్కని వాసన తో  నీ ళ్లు  పారుతూ ఉన్నాయి రో డ్డు మీద .
పక్కనే పెద్ద పబ్లిక్ టాయి లెట్ .
సన్నటి కంకర ,,నీ ళ్ల కి తో డు ,,, వంకర రోడ్డు .
ఎగ్జాట్ పిక్చర్ కోసం  బ్రేక్ బట్  .
మర్చిపోయి  ఫ్రంట్ బ్రేక్ .... .
అసలు ఈ నీళ్ళు కాళ్ళ మీద పడితేనే తట్టుకోలేను అటువంటిది నేను నేనే  మొత్తం పడ్డాను.చ్హ.
..




 .

Sunday, July 1, 2012

ఆమె నా వైపే చూస్తోం దా ?

ఆమె నా  వైపే చూస్తోం దా ?అవును సందేహం లేదు.రోడ్డు కిఇటువైపు ,నందు, నిల్చున్నాడు.
ముందు కొంచెం ఇబ్బంది గా  అనిపించినా తరువాత ఆసక్తిగా మారింది సీను .
ఆ అమ్మాయి ఇప్పుడు నవ్వుతోం దా ?అవును డౌటే  లేదు. అనుకున్నాడు మనసులో.
షిట్! ట్రా ఫిక్ .అమ్మాయి రోడ్డు కి అటు వైపు నేను ఇటువైపు.
ఇన్నాళ్ళు నేను వయసు పై బడిన వాడిలా కనిపిస్తున్నా అనుకుంటూ ఉన్నా .
నో నో .నా గురించి నేనే
తప్పు అంచనా వేసుకుంటున్నా.
అ రె ఈ మధ్య డై కూడా వేసికోట్లా  .
వేసికొం టె ?ఓహ్!
ఆనందంతో కన్ఫ్యూస్ అయి పోతున్నాడు నందు..
భగవంతుడు ఒక్కొరికీ ఒక్కో గొప్పదనం ఇస్తాడంటారు .
నిజమే.... ఆ దేవుడికి కృతజ్ఞతలు (థ్యాంక్స్) చెప్పుకోవాలిసిం దే.
రోడ్డు దాటి వెళ్ళనా ?
 నో..  చీప్  అయిపోతా .
అనవసరంగా ,నాకు నేను ఈ చాన్సు పోగొట్టు కున్న ట్లు అవుతుంది..
అంతా  చెడ గొట్టు కున్న ట్లు అవుతుంది.
నే నంటే  అంత ఇష్ట పడే ఆమె తనకి తనే వస్తుంది.రా వా లి .
మరొక్క సారి చూ  సా డు .రెప్ప కూ డా వాల్చకుండా చూస్తోం దే.
పాపం ఆ రెప్పలు అలిసిపోయి వడలి పొతే తరువాత బాధ పడ వలసింది తనే.
ఇహ ఎంత మాత్రం ఆలస్యం చెయ్యొద్దు.
కానీ  ,ఎలా ?
ఇంత డిఫికల్ట్ సిచ్యు ఎషన్ ని హ్యాండిల్ చెయ్యడం. .
ఎనీ వె .నేనే వెళ్ళాలి.అనుకు న్నాడు.
కానీ ఆమే  రోడ్డు దాటి రాబోతోంది.
కంట్రోల్ .కంట్రోల్.అనుకున్నాడు.
అమ్మాయి నా కంటే చాల చిన్నది.
దీ న్ని బట్టి ఇప్పుడు నా వయసు ని నేను తిరగ రాసుకోవాల్సిన టైం  వచ్చిం దని తెలుస్తోంది
సో, సో,
అమ్మాయి దగ్గరికి వచ్చింది.
ఇంకా దగ్గరికి వచ్చింది.
మీ అమ్మాయి పల్లవి ఫ్రెండ్ ని .
గుర్తు పట్టలేదా అంకుల్?
 మీ ఇంటికి ఒకసారి వచ్చా.
చాలా రోజులైంది లెండి అన్నది...