Sunday, July 1, 2012

ఆమె నా వైపే చూస్తోం దా ?

ఆమె నా  వైపే చూస్తోం దా ?అవును సందేహం లేదు.రోడ్డు కిఇటువైపు ,నందు, నిల్చున్నాడు.
ముందు కొంచెం ఇబ్బంది గా  అనిపించినా తరువాత ఆసక్తిగా మారింది సీను .
ఆ అమ్మాయి ఇప్పుడు నవ్వుతోం దా ?అవును డౌటే  లేదు. అనుకున్నాడు మనసులో.
షిట్! ట్రా ఫిక్ .అమ్మాయి రోడ్డు కి అటు వైపు నేను ఇటువైపు.
ఇన్నాళ్ళు నేను వయసు పై బడిన వాడిలా కనిపిస్తున్నా అనుకుంటూ ఉన్నా .
నో నో .నా గురించి నేనే
తప్పు అంచనా వేసుకుంటున్నా.
అ రె ఈ మధ్య డై కూడా వేసికోట్లా  .
వేసికొం టె ?ఓహ్!
ఆనందంతో కన్ఫ్యూస్ అయి పోతున్నాడు నందు..
భగవంతుడు ఒక్కొరికీ ఒక్కో గొప్పదనం ఇస్తాడంటారు .
నిజమే.... ఆ దేవుడికి కృతజ్ఞతలు (థ్యాంక్స్) చెప్పుకోవాలిసిం దే.
రోడ్డు దాటి వెళ్ళనా ?
 నో..  చీప్  అయిపోతా .
అనవసరంగా ,నాకు నేను ఈ చాన్సు పోగొట్టు కున్న ట్లు అవుతుంది..
అంతా  చెడ గొట్టు కున్న ట్లు అవుతుంది.
నే నంటే  అంత ఇష్ట పడే ఆమె తనకి తనే వస్తుంది.రా వా లి .
మరొక్క సారి చూ  సా డు .రెప్ప కూ డా వాల్చకుండా చూస్తోం దే.
పాపం ఆ రెప్పలు అలిసిపోయి వడలి పొతే తరువాత బాధ పడ వలసింది తనే.
ఇహ ఎంత మాత్రం ఆలస్యం చెయ్యొద్దు.
కానీ  ,ఎలా ?
ఇంత డిఫికల్ట్ సిచ్యు ఎషన్ ని హ్యాండిల్ చెయ్యడం. .
ఎనీ వె .నేనే వెళ్ళాలి.అనుకు న్నాడు.
కానీ ఆమే  రోడ్డు దాటి రాబోతోంది.
కంట్రోల్ .కంట్రోల్.అనుకున్నాడు.
అమ్మాయి నా కంటే చాల చిన్నది.
దీ న్ని బట్టి ఇప్పుడు నా వయసు ని నేను తిరగ రాసుకోవాల్సిన టైం  వచ్చిం దని తెలుస్తోంది
సో, సో,
అమ్మాయి దగ్గరికి వచ్చింది.
ఇంకా దగ్గరికి వచ్చింది.
మీ అమ్మాయి పల్లవి ఫ్రెండ్ ని .
గుర్తు పట్టలేదా అంకుల్?
 మీ ఇంటికి ఒకసారి వచ్చా.
చాలా రోజులైంది లెండి అన్నది...

1 comment:

Sai said...

హహహ.... బాగుంది అండీ...