Friday, July 13, 2012

స్పీ డు గా పోయి మద్యలో పెట్టాలి

చూసావా,, మా వాడి బైక్ .స్పోర్ట్స్ బైక్ .కలర్ ,ఎర్రటి ఎరుపు .మా వాడు .......... .ఆ షైనింగ్ లు చూడు.అన్నది తల్లి.
''డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?'' అడిగింది.పక్కింటి ఆమె.
''ఎందుకు ?నువ్వు మరీ  విచిత్రం.వాడు ,వాళ్ళ నాన్న పేరు చెబితే చాలదూ?వాడి లైసెన్సు అడగడం కాదు గదా వాడి వైపు కుడా చూ డరు  పోలీసులు.''
''అయితే జాగ్రత్త గా  నడుపుతాడా ?''
''అయ్యో ఈ రోజుల్లో పిల్లలకి మనం జాగ్రత్త చెప్పాలా,వాళ్ళే మనకి చెప్తారు. ''
''అసలు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు వాడు.ఎంత ముద్దొచ్చి చస్తున్నాడో! అన్నది తల్లి.''
''ఏరా ,అయిందా ?బయలుదేరదామా? అడిగింది తల్లి''..
.......................................................................................................................................................
.....................................................................................................................................................

'మమ్మీ, ,  ఆ బో ర్డ్  ఏం  టి  ''మీ వివాహమునకు మీరే  బాధ్యులు ''అని రాసారు.. అంటే ఏంటి మమ్మీ  ?అన్నాడు కొడుకు..
నీ  బొంద బోర్డు సరిగ్గా చదవ వు . నన్ను చంపుతావ్.
అది వివా హం కాదు  ''మీ వాహనము నకు మీ రే బాధ్యులు ''అయి ఉంటుంది .''''.అన్నది  వెనుక కూర్చున్న మమ్మీ..
''ఈగ  ''హిట్టు మమ్మీ  .''మేం వయసుకు వచ్చాం'' కొత్త సినిమా రిలీజ్''.......................................................పోస్టర్ లు చూ స్తూ,  చదువుతూ బండి నడుపుతున్నాడు.
బండి స్పీడు  పెంచాడు సడెన్ గా  .
''ఏంట్రా అంత స్పీ డు ''.
''ఏం  లేదు'',........ ''ఏం  లేదు సిగ్నలు మారుతోంది.గ్రీ న్  పోతోంది. అందుకే''.
''అయ్యో''
 .................................................................
........................................................................................................................................................

''మళ్లీ  ఏంట్రా ?ఈ స్పీ డు ''..
''రోడ్డు దాటాలి మమ్మీ  .
ఇక్కడ సిగ్నల్ ఉండదు.
స్పీ డు  గ పోనిచ్చి రోడ్డు మద్యలో పెట్టా లి అప్పుడు గాని క్రాస్స్  చెయ్యటం కుదరదు.ఎవరు ముందు పెడితే వాళ్ళే .
ఆయన ఎవరో చూ డు  ఎంత సేపట్నుం డి అక్కడే ఉన్నాడో ,
అట్లా అయితే తెల్లారుతుంది.
ధైర్యం ధైర్యం ,ఉండాలి మమ్మీ .
స్పీ డు  గా  పోయి మద్యలో పెట్టాలి .అప్పుడు గాని వీ ళ్ళ  రోగం కుదరదు.సిటీ  లో  అట్ల ఉంటే నే తప్ప బతకలేం.''.............................................................................................................................................................
...........................................................................................................................................................
''అయ్యో అయ్యో !చెప్తే వినలా ''
యా క్సి డెంట్ !
పడేసి చచ్చావ్ ''.
''నడిరోడ్డు మీ ద  పడేసావ్ .కాలు మళ్లి   విరిగింది.
ఇంతకుముందు విరిగినప్పుడే   డాక్టర్లు ఆపరేషన్ చేసారు.సక్సెస్ కాలేదు.
ఒక కాలు పొట్టి ఒక  కాలు పొడుగు. ఒక చెప్పు హైట్ ,ఒక చెప్పు డౌనూ .ఈ సారి ఇంకా   పొట్టి అయితుం దేమో . ఒక కాలు మోకాలు వరకు వస్తుందేమో''.

2 comments:

Padmarpita said...

Ha:-) ha:-)

Unknown said...

అయ్యో! మళ్ళీ యాక్సిడెంటా? అయితే ఈ సారైనా మమ్మీకి కాలు సెట్టవుతుందో లేదో?.
"అయ్యో అయ్యో !చెప్తే వినలా"
యాక్సిడెంట్!
:))