Saturday, January 17, 2015

ఘంటశాల గారి గాత్రం -

  భూ లోక స్వర్గం

ఘంటశాల గారి గాత్రం
అలవాటైతే చాలు
వినాలనే ఆత్రం
తాపత్రయం
అదో ధ్యానం
ప్రశాంత భావం

వీనుల విందు
శ్రోతలకి పసందు

విల విల లాడిన వేళ
ఆయన లేని ఈ నేల 

సూర్యాస్తమయంలోనే మరో సూర్యోదయం


ముగిసిన ఒక కాలాన్ని
చిగురింపజేసిన మరొక గానం

తహ తహ లాడే తెలుగు శ్రోతకి
ఓ బాలోదయం
ఒక భానోదయం

కల కాలం ఉండేవి
ఈ రెండే

Wednesday, January 14, 2015

అడ్డమొస్తే మీ నాన్ననే కాదు వాడి అబ్బని కూడా ....

 చెక్కల్ర్రావ్ , చొంగా రావు సినిమా చూస్తున్నారు.

'ఈవ్ టీజింగ్ కింద నిన్ను  ఆర్నెల్లు జైల్లో తోస్తారు తెలుసా?   మా నాన్న కి చెప్తానుండు నీ పని ' అన్నది హీరోయిన్.
'ఆర్నెల్లు జైలు శిక్ష  కాదే  ఉరిశిక్ష అయినా భరిస్తా నీకోసం ,, అడ్డమొస్తే మీ నాన్ననే కాదు వాడి అబ్బని కూడా అడ్డంగా నరికేస్తా'  అన్నాడు హీరో.
అరేయ్ ఈ డైలాగులు చూసాక కూడా నీకు ఏమీ అనిపించట్లేదా? నువ్వు ప్రేమించిన అమ్మాయికోసం ఆ హీరో చెప్పిన మాటలు కూడా నిన్ను కదిలించట్లేదారా?నీలో చలనం ఇంత చచ్చి పోయిందారా?నువ్వు నా ఫ్రెండ్  అని చెప్పుకోవాలంటేనే సిగ్గేస్తోందిరా అన్నాడు  చెక్కల్ర్రావ్  చొంగా రావు తో.
సరె రా ఇప్పుడే ఇప్పుడే నాకు జ్ఞానోదయమైంది.నిజంగా ఈ సినిమా నే చూడక పోతే  ఈ రోజున నువ్వు నన్ను మార్చేవాడివారా?నిజంగా నీకు చాలా చాలా రుణపడి ఉంటానురా నాకు ఈ సినిమా చూపించినందుకు.ఆ సినిమా తీసిన వాడికి,, డైలాగులు రాసిన వాడికి కూడా ఎంతో రుణ పడి ఉంటా రా.
ఇంక ఆగను నా ప్రేమని ఆపుతున్న ఆ అనూష  అబ్బని అడ్డంగా నరికేస్తా అంటూ కత్తి తీసుకొని బయలుదేరాడు చొంగా రావు. 

Saturday, January 10, 2015

భూ లోక స్వర్గం

మధురాతి మధురాలు ఎక్కడెక్కడి నుండో చెవిన బడుతుంటాయి .గాలి పొరలని ఏ తెరలు ఆపినా అధిరోహించి  ఏదో ఒక దారిలో చెవికి చేరుతునే  ఉంటాయి   .అవి ఎక్కడి నుండో కాదు సాక్షాత్తూ మీ నుండే వింటున్న భావన. అక్కడక్కడా కన్నులార్పి పొందే తన్మయత్వం ఈ గుండె కెంతో హాయి. లో లో పల ప్రేమ తో మీతో ఒక మాట చెప్పాలని, మాట్లాడాలనీ, మీ ప్రక్కనుండాలనీ  కోరిక. ఇది ప్రతి ఒక్కరికీ దక్కేనా?

Thursday, January 8, 2015

రెక్కలొచ్చే వరకు ప్రక్క ప్రక్క నే

రెక్కలొచ్చే వరకు ప్రక్క ప్రక్క నే తిరుగుతారు
రెక్కలు రాగానే పక్క పక్క కెళ్ళి పోతారు
ఏవో ఏవేవో సాకులు చెప్తారు.
 ఒక్క మాటా మాట్లాడే తీరిక   లేదంటారు   
ఏం చెప్పినా చేసే  పిల్లల్లా కాకుండా
నేం చెప్పినట్లు చెయ్యొచ్చు కదా
మేం చెప్పింది వినొచ్చుకదా
అనే పెద్దల్లా   తయారవుతారు.
ఏ మూల నున్నా వెతుక్కుంటూ వచ్చే వయసునుండి
ఒక మూల పడి ఉండొచ్చుగా అని   అరిచి  మండి పడతారు.  
అది కావాలి ఇది కావాలి అని కొనిపించుకున్నవి   మర్చి పోయి
ఇది  వయసా అది  అవసరమా అని రెచ్చి పోతారు
ఈ పిల్లల మాటేమో
కొంచెం ముందు  మనమూ  అలాంటి వాళ్ళమేమో?