Friday, November 28, 2014

ఇది భక్తి కాదు.

ఇది భక్తి కాదు.

బుధ్ధి లేని వాళ్ళ పలుకుబడి అహంకారపు శక్తి.


ఎద్దులు ,,


కార్లని గుడి ముందే ఆపాలి.


తీరుబడి గా దిగాలి.



ట్రాఫిక్ ని ఆపాలి.

అర్జంటు గ వెళ్లే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి.

పేషెంట్ లని చంపెయ్యాలి.

తిట్టించుకోవాలి. 

తిట్టాలి.

ఈ కారెవరిదనుకుంటున్నావురా? అనాలి.


ఈ ఎద్దులు కొంచెం హద్దు లోనే కార్లని ఆపితే 


దేవుడికి ముద్దు


నడవగలిగితే కొంచెం కొవ్వు ని కూడా రద్దు చేస్తాడు.




Friday, November 14, 2014

షీ టీం లొచ్చాయి

షీ టీం లొచ్చాయి

మఫ్టీలో ఉంటారు పోలీసులు.

ఆడపిల్లల్ని వేధించే వాళ్ళని

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు.

ఇప్పుడైతే,,

 కంప్లైంటు ఇచ్చి పోలీసులొచ్చేలోపు  ఆకతాయిలు

తప్పించుకుంటున్నారు.

షీ టీము ల్ని  ప్రవేశ

పెట్టే వరకు వచ్చింది

ఆడపిల్లల పరిస్థితి ఎంత దయనీయం

ఆడపిల్లల్ని అండ దశలోనే చంపేసిన అమ్మ  అయ్య లు దున్నల్ని  కని

వేరే అమ్మ అయ్య లు కన్న ఆడపిల్లల్ని ఏడిపించడానికి

ఈ దున్నల్ని తాడువదిలి విడ్చి పెడుతున్నారు

 పిల్ల లు ఓ పక్క రోడ్డు దాటుతోంటే కూడా విడిచి పెట్టట్లా ఈ దున్నలు

బైకులు,, ఒక్కో బైకు కి మూడు దున్నలు

అనేక అడ్డాలు

రోడ్డు దాటే టెన్షనే భరించాలా ఈ దుర్మార్గుల చిత్రవధ నే ఎదుర్కోవాలా?

పల్లెల్లో బహిర్భూమికి కూడా వెళ్ళనివ్వట్లా.

తల్లీ తండ్రులు తప్పని చెప్తున్నారా?

లేక

తమ పిల్లలు మగ పిల్లలని గర్వ పడుతున్నారా?

ఆడపిల్ల తల్లీ తండ్రులు కి ఒక ముచ్చట

కానీ

ఈ ముచ్చట తీర్చుకోవాలని చాలామంది అనుకోవడం లేదు.

ఆడపిల్లకి రక్షణ లేదు .

Thursday, November 13, 2014

బంగారు తెలంగా నాళాలో..


నాళా లో కొట్టుకు పోయే సంప్రదాయం
చాలా పాత కథే ?
కడుపు కోత కన్నవాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు.
ఆ కన్న వాళ్ళ స్థానంలో ప్రతి వాళ్ళు తమని తాము ఊహించుకుంటే తెలుస్తుంది.
బాధ లో పోయినోళ్ళకోసం పోవాలో
ఉన్న వాళ్ళకోసం ఉండాలో
అంతా ప్రభువుల దయ.
అదృష్టం ఉంటే రేపటి దాకా బ్రతికుంటాం లేక పోతే లేదు.
మన పనులు మనవి.
ఒకళ్ళు ఆఫీసుకెళ్తారు,మరొకరు ఫ్యాక్టరీకి వెళ్తారు.
ఒకళ్ళు కాలేజి కి ఇంకొకళ్ళు మ్యారేజి కి.
ఎవరి పనుల్లో వాళ్ళు.
కానీ గాంధీ హాస్పిటల్ దగ్గరే సత్యవాణి తల్లి దండ్రులూ, తోబుట్టువులూ.
మన సమస్య కానే కాదు మరెవరిదో.
మన పనుల్లో మనం .
పోయినోళ్ళు వస్తారా ఏంటి .
మన సమాధానం.
అమ్మా సత్య వాణీ ఏమీ అనుకోవద్దు.
ఈ రోజు రాలేక పోయాం కానీ ఏదో ఒక రోజు ప్రభువులు చేయించే
బంగారు తెలంగా నాళాలో మేమూ నీ దగ్గరికే వస్తాం.
మనకీ రేపు మూడింది.
అదిగో అట్లా మాత్రం మాట్లాడొద్దు.

Saturday, November 8, 2014

జీవితాన్ని అనుభవించాలని కాదు

 అనుభవించాలని కాదు
 పిల్లలకి అండగా ఉండాలని
ప్రతి రైతుకీ
 అందరిలానే కొన్నాళ్ళు బ్రతకాలనే
కోరిక 

 అబద్దాలాడే ప్రభువుల రాజ్యాలలో 
 బ్రతుకు బ్రతకాలనీ కాదు
భోగాలతో తులతూగాలనీ కాదు
అంతా మాయే
సున్నా సాయమే
కుర్చీలు ఎక్కాక

 ఇచ్చిన మాట మర్చిపోవడం
వాళ్ళ బాట
ప్రజలని బురిడీలు కొట్టించడం 

ఒడ్డెక్కడం
 పనులు చక్క బెట్టుకోవడం
నక్కా కాకీ రొట్టె కథ
రెట్ట రాజకీయం.

రెట్ట రాజకీయం

జీవితాన్ని అనుభవించాలని కాదు
తమ వారికి తమ ప్రియమైన పిల్లలకి అండగా ఉండాలని
ప్రతి రైతుకీ సగటు వ్యక్తికి
ఈ అందరిలానే కొన్నాళ్ళు బ్రతకాలనే
కోరిక తప్ప పచ్చి అబద్దాలాడే ప్రభువుల రాజ్యాలలో ఈ బ్రతుకు బ్రతకాలనీ కాదు
భోగాలతో తులతూగాలనీ కాదు
అంతా మాయే
సున్నా సాయమే
కుర్చీలు ఎక్కాక ఇచ్చిన మాట మర్చిపోవడం
వాళ్ళ బాట
ప్రజలని బురిడీలు కొట్టించడం ఒడ్డెక్కడం
తమ పనులు చక్క బెట్టుకోవడం
అదే నక్కా కాకీ రొట్టె కథ
రెట్ట రాజకీయం.

Saturday, November 1, 2014

భూ లోక స్వర్గం

తెలుగులా రాలి తమిళమై సాగి ,
కన్నడ అయిపోయి ,
మళయాళమై మ్రోగి ,
హిందీ లా పొంగి ఉవ్వెత్తే 
మీ పాటా ప్రతి నోటా 
ఏటేటా ప్రతి చోటా
పాటలు నదులై
భాషలు కడలులై .
బాలు గారూ మరచి పోకండి
మమత మీరే.