Thursday, November 13, 2014

బంగారు తెలంగా నాళాలో..


నాళా లో కొట్టుకు పోయే సంప్రదాయం
చాలా పాత కథే ?
కడుపు కోత కన్నవాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు.
ఆ కన్న వాళ్ళ స్థానంలో ప్రతి వాళ్ళు తమని తాము ఊహించుకుంటే తెలుస్తుంది.
బాధ లో పోయినోళ్ళకోసం పోవాలో
ఉన్న వాళ్ళకోసం ఉండాలో
అంతా ప్రభువుల దయ.
అదృష్టం ఉంటే రేపటి దాకా బ్రతికుంటాం లేక పోతే లేదు.
మన పనులు మనవి.
ఒకళ్ళు ఆఫీసుకెళ్తారు,మరొకరు ఫ్యాక్టరీకి వెళ్తారు.
ఒకళ్ళు కాలేజి కి ఇంకొకళ్ళు మ్యారేజి కి.
ఎవరి పనుల్లో వాళ్ళు.
కానీ గాంధీ హాస్పిటల్ దగ్గరే సత్యవాణి తల్లి దండ్రులూ, తోబుట్టువులూ.
మన సమస్య కానే కాదు మరెవరిదో.
మన పనుల్లో మనం .
పోయినోళ్ళు వస్తారా ఏంటి .
మన సమాధానం.
అమ్మా సత్య వాణీ ఏమీ అనుకోవద్దు.
ఈ రోజు రాలేక పోయాం కానీ ఏదో ఒక రోజు ప్రభువులు చేయించే
బంగారు తెలంగా నాళాలో మేమూ నీ దగ్గరికే వస్తాం.
మనకీ రేపు మూడింది.
అదిగో అట్లా మాత్రం మాట్లాడొద్దు.

No comments: