Wednesday, June 27, 2012

లేటు లేటు లేటై o ది.

ఎంటే మీరు కూడా వచ్చేసారు అన్నది అశ్చ్యర్యం  గా స్వర్గంలో  ఉన్న బామ్మ  .
కూతురిని మనమ రాలిని  చూసి ముందు సంతోషించి వెంటనే బాధ పడిపోతూ 'ఎందుకే నాతో  కూడా వచ్చేసారు.మీకేం తొందర వచ్చింది అని కోప్పడింది.
అది కాదు అమ్మా  అని కూతురు చెప్పబోతే మనమ రాలు 'నేను చెప్తా  బామ్మా అని మొదలెట్టింది.
బామ్మా నువ్వు నిన్న సాయంత్రం పోయ్యావని  మాకు కబురొచ్చింది
.మేమేమో సూరత్ లో ఉన్నాం.అక్కడి నుండి వచ్చేసరికి నిన్ను ఉంచు తారో  లేదో ,
ఆఖరి చూపు అందుతుం దో  లేదో అని డౌ టు  వచ్చింది.
 ఫ్లయిట్  లో వద్దామం టె  అక్కడ ఎఇర్ పోర్ట్ లేదు.
అందుకని ముందు బాంబే కి ట్రెయిన్  లో వచ్చాం.
అక్కడి నుండి ఫ్లయిట్  లో పొద్దున్న ఎనిమిది గంటలకి హైదరా బాదు  చేరాం .
ఇక శంషా  బాద్ లో ట్యాక్ సీ  మాట్లాడుకున్నాం.
డ్రైవర్ జాగ్రత్తగా నెమ్మదిగా మమ్మల్ని ఇంటికి తీసుకు వస్తున్నాడు.
అమ్మకేమో కంగారు.నిన్ను చూస్తామో లేదో అని ఒకటే గోల ఏడుపు.
డ్రైవర్ ని తొందర పెట్టింది.
బాగ  సతాయించి నానా గోల పెట్టింది.
లేటు లేటు లేటు లేటై  o ది  అని.
ఆ  కంగారులో డ్రైవర్ డివైడర్  ని కొట్టి కారు పల్టీ  కొట్టించా డు .
ముగ్గురం వచ్చేసాం .
డ్రైవర్ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటాడు.
మీ లేటు   కాలిపోనూ  అన్నది బామ్మ .
ఇంకేముంది అంతా కా లే పోయ్యాం 
ఇప్పుడు మన అందరి పేర్ల కి ముందు లేటు అని పెడతారు  అన్నది మనమ రాలు.