Wednesday, October 30, 2013

అమ్మ తోడు ఒక్కడ్ని ఒదిలిపెడితే ఒట్టు.

అమ్మ తోడు ఒక్కడ్ని ఒదిలిపెడితే ఒట్టు.
అడ్డొచ్చినోడ్ని అడ్డంగ నరికేస్తా.
 నేను నరకడం మొదలు పెడితే,నరకానికి హౌజ్ ఫుల్ బోర్డు పెడతారు. ఒక్కడైనా ఇక్కడి నుండి తప్పించుకుంటే నేనసలు ఒక అబ్బకే పుట్టలేదు.
శత్రువు తప్పించుకోకుండా గడి పెడదామనుకున్నాడు గానీ అక్కడ తలుపులు లేవు.
తెగ రెచ్చిపోతున్నాడు మా వాడు. మా పిన్ని కి చెప్పా .వాడ్ని ఎక్కువగ సినిమాలకి పంపించొద్దని.నా మాట వింటేగా.
ఎదురుగ పదిమంది ఉన్నారు.ఇటు మావాడొక్కడే.
ఈ సినిమా ఏమవుతుందో ,ఎట్లా ఎండ్ అవుతుందో అన్న టెన్షన్ నాకు.
ఇంకా ఇంకా పేల్తునే ఉన్నాడు.
గతంలో కూడా సినిమాల మోటివేషన్ తో రెచ్చిపోయ్యాడు.
మున్సిపల్ పంపు ని కాల్తో ఈడ్చి కొట్టాడు.నీళ్ళు చిమ్మిచ్చి కొడతయ్యనుకున్నాడు.శత్రువు భయపడి పోతాడనుకున్నాడు.కానీ      వీడి    రక్తం చిమ్మించి కొట్టింది.హాస్పిటల్ లో చేర్చాం.బిల్లు పది వేలైంది.
మళ్ళీ ఇంకోసారి గోడని ఈడ్చి గుద్దాడు.గోడ ఇరుగుతుందనుకున్నాడు.కానీ చెయ్యి విరిగింది.
మాకసలు ఏంటి వీడితో ????.రోజూ ఇదే గొడవ.ఈ సినిమాలు తీసే డైరెక్టర్లకి ,నిర్మాతలకి
ఒక రిక్వెస్ట్ లేఖ ఇచ్చుకుంటే బాగని పిస్తోంది.
ఆ హీరోలు చాలా ఈజీ గ చేసేస్తున్నారు ఫైటింగులు.వాళ్ళలొని శక్తి చూస్తే ముచ్చటేస్తుంది.వాళ్ళు మనుష్యులు కారేమో.దైవ శక్తులు సంపాదించుకున్న దివ్య పురుషులు .ఫిల్మ్ నగర్ వాసులు.కానీ మావాడికి ఆ శక్తులు అబ్బక ,ఉన్న శక్తి అచ్చి రాక ఆస్పత్రి పాలవుతున్నాడు.

No comments: