Monday, November 18, 2013

ఫిల్మ్ తియ్యాలని తెలియదా?

స్టాప్ స్టాప్ అని వినబడింది.
వెంటనే ఆపేశాడు రాజు .
ఫిల్మ్ తియ్యాలని తెలియదా?
ఎన్నాళ్ళయింది సుప్రీం కోర్ట్ చెప్పి.
కోర్టుల మాటంటే అంత చీపై పోయిందా మీకు.""ఆవేశంగా అడిగాడు ఆ వ్యక్తి.
""నాది కారు కాదండీ,బైకు.ఇది హెల్మెట్.మీరు ఫిల్మూ అదీ అంటే నాకు అర్థం కావట్లేదు.""""అన్నాడు రాజు.
హెల్మెట్ అయినా సరే .బ్లాక్ గ్లాస్ ఉంది.నీ మొహం కనబడట్లేదు.ఇట్లా కనబడక పోతే నేరాలు జరిగే అవకాశం చాలా ఉంది.అన్నాడు ఆ వ్యక్తి.
నా.......... మొహం !!!!
.ఉట్టి మొహమే కదా కనబడట్లేదు.మొహంతో ఏం నేరం చేస్తా నేను"" అన్నాడు రాజు.
ఇట్లాంటి కబుర్లు చెప్పి నన్ను మోసం చెయ్యకు.మొహంతో అనేక నేరాలు చెయ్యొచ్చు.
నీ కళ్ళతో షార్ప్ గా ఎవర్నైనా చుసి,అదీ అమ్మాయిల్ని చూసి గాయ పరచొచ్చు.
అంతే గాదు
నోటి తో నేరం చెయ్యొచ్చు.""అన్నాడు.
నోటితో లోపల్లోపల ఏం చేస్తా చెప్పండి""అన్నాడు రాజు.
అదే ,మరి .ఎటకారం అంటే.నోటి తో అసభ్యంగా ఇకిలించొచ్చు అదీ స్థ్రీలని చూస్తూ."అన్నాడు
నేనికిలించినా వాళ్ళకి కనబడదు గద్సారూ.వాళ్ళకీ తెలియదు కదా"అన్నాడు రాజు.
అదే... మరి..... మాకు......... మాకు తెలియాలి . తలకాయ ఊపి పిలుస్తావు.అడిగితే నే నూపలేదూ హెల్మెట్ ఊగింది అంటావ్."" అన్నాడు ఆ వ్యక్తి.
సరే ఇంతకీ ఏం చెయ్యాలి చెప్పండి.మా ఇంటి అద్దాలూ,మా షాపు అద్దాలూ కూడా బ్లాక్ గ నే ఉన్నాయ్.అవి కూడా తీసెయ్యమంటారా?అన్నాడు రాజు.
అదిగో మళ్ళీ ఎటకారం.అదే వొద్దు.అన్నాడు ఆ వ్యక్తి.
సరే ఏం చెయ్యమంటారు ఇప్పుడు"" అడిగాడు రాజు.
ఎంతో కొంతియ్.""అన్నాడు.
అసలిచ్చే పనేంటి.""అన్నాడు రాజు.
ఏదో చూడ్రాదూ .ఫ్యామిలీ ఉందిలే.""అన్నాడు.


No comments: