Wednesday, October 22, 2014

సరే పెద్ద వాళ్ళు,,,, అడిగారు

ఆయన,, మురళి  జాబ్ మారుతున్నాడు.ఇంకా దొరక లేదు.నేనూ అంతే అదే పరిస్థితి.కూర్చుని తింటే ఎన్నాళ్ళు తింటాం. మా సేవింగ్స్ అన్నీ అయిపోవస్తున్నాయి.ఇంటి దగ్గర మా పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి రోగాలూ అవీ ఇవీ అన్నీ కలిపి అంతా ఖర్చే ఖర్చు.

ఆలోచనలతో కూర్చున్నా.ఇంతలో పక్కన కాంతమ్మ్మ వచ్చింది.అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది.అవీ ఇవీ కబుర్లు మోసుకొస్తుంటుంది.విన్నా వినకపోయినా చెప్పటం ఆమెకు అలవాటు.భార్యా భర్త ఇద్దరే ఉంటారు.పిల్లలు ఉద్యోగాల్లో ఎక్కడివాళ్ళు అక్కడే ఇంక చెప్పేదేముంది.వీళ్ళు దాచుకున్నవి వీళ్ళకి సరిపోను కాస్తో కూస్తో మిగులుస్తుంటారు.
ఇంతలో కాంతమ్మ భర్త అప్పారావు గారు కూడా ఊడిపడ్డారు.
'ఏమ్మా బాగున్నావా' అన్నారు.అన్నట్లు నువ్వొక పని చేసి పెట్టాలి.
'ఏంటదీఅడిగా.
రేపు కొంచెం నీ కారులో మా ఇద్దరినీ మా వాళ్ళింటికి తీసికెళ్ళాలి
ఓ నలభై కిలో మీటర్లు  .డబ్బులు నేనిస్తాను.వద్దంటే కుదరదు 'అన్నాడు.
ఈ మధ్య మేము కారు కూడా వాడట్లేదు.సరే పెద్ద వాళ్ళు అడిగారు కాబట్టి కాదనలేక పోయా.డబ్బుల కోసం కాదు.
పొద్దున్నే బయలుదేరాం.అక్కడికెళ్ళాక అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ లేటే అయింది.
తిరిగి వచ్చే దారిలో అప్పారావు గారు చాలా సంతోషంతో 'చాలా జాగ్రత్తగా తీసుకొచ్చావమ్మా చచ్చి నీ కడుపున పుడతా అంటూ పొగడ్తల తో ముంచెత్తాడు.
సరే నెమ్మదిగా వాళ్ళ ఇంటి ముందు ఆపా.ఇద్దరూ దిగారు.
నేను మా ఇంటి ముందు కారు పెట్టడానికి కారు స్టార్ట్ చేస్తుండగా అప్పారావు  గారు నా దగ్గరగా వచ్చి వంగి 'అమ్మా ఇంకో సారి అవసరమైతే పెట్రోలుకి నేనే డబ్బులిస్తా' అన్నారు.సరే ఫరవాలేదండీ అని ముందుకొచ్చాను.

No comments: