Sunday, November 8, 2015

బజారు కని పంపించా స్నాచింగ్ ..

బజారు కని పంపించా.
 ఇంతవరకు రాలేదు .
బయటకొచ్చి చూస్తోంది నరసమ్మ.
 ఏవరు కలిస్తే ఎవరితో కబుర్లలో పడ్డాడో ఏమో ఈ మనిషి అనుకుంటు తనలో తనే
మట్లాడుకుంది.
ఇంతలో మూల మీద కనిపించాడు.
హమ్మయ్య అనుకుంది.కానీ అదేంటో ,కుంటుతూ వస్తున్నాడు.కాస్త దెబ్బలు
తగిలినట్లున్నాయి.
ఆదుర్దాగా ఎదురెళ్ళింది.
ఏంటండీ ఈ బట్టలనిండా మట్టి ఏంటి?
 నేను షాపు కెళ్ళ మన్నాగా ?
ఎక్కడి కెళ్ళి వస్తున్నారు.?అన్నది.
స్టేషన్ కెళ్ళి వస్తున్నా అన్నాడు.
అదేంటి రైల్వే స్టేషనుకా ?
మనవాళ్ళెవరూ వచ్చేవాళ్ళు లేరే ఎందుకెళ్ళారు ?అన్నది.
ఆ స్టేషన్ కి కాదే పోలీసు స్టేషన్ కి.అన్నాడు.
ఏందుకు?అన్నది భయంగా.
కంప్లైంటు,, కంప్లైంట్ ఇవ్వడానికి.
ఎందుకు ?అడిగింది.
షాపుకెళ్ళానా?
వచ్చేటప్పుడు
వచ్చేటప్పుడు కవరు చేతిలో పట్టుకొస్తున్నానా?
ఎవడో రానే వచ్చాడు వెనుక నుండి.
స్నాచింగ్ చేసాడు.
అదేంటండీ మీ మెళ్ళో గొలుసు గట్రా లెవ్వుగా?
ఆది కాదే కవరు కవర్ని స్నాచింగ్ చేసాడు.
అందులో కంది పప్పు ఉందే. నువ్వు తెమ్మన్నావుగా?

No comments: