Tuesday, November 10, 2015

ఇప్పుడు నొప్పి చాలా నయమయింది.

ఒకటో నంబరు బస్సు అది.ఆఫ్జల్ గంజ్ కి.
సన్నగా వర్షం.
లోపల సీటు దొరికింది.
సీట్లలో కూర్చున్నవాళ్ళు తప్పితే బస్సంతా ఖాళీనే ఆ టైంలో
.ఇంతలో కండక్టర్ వచ్చాడు.గోల్కొండ క్రాస్ రోడ్ ఒకటి ఇమ్మన్నా.అప్పటికి బస్ ,,స్టేషన్ దాటి బోయి గుడా వరకు వచ్చింది.
ఫుట్ బోర్డు మీద నిలబడ్డవాళ్ళు, వేళ్ళాడబడే వాళ్ళు కలిపి ఏడెనిమిదిమందే వుంటారు.ఇద్దరు అఫ్జల్ గంజ్ ,మరో ఇద్దరు కాచిగుడా ఒకడు చిక్కడపల్లి,మరొకడు నారాయణగూడా.బస్సంతా ఖాళీ అయినా వాళ్ళు కూర్చోరు.కండక్టర్ చెప్పొచ్చుగాఫుట్ బోర్డు మీదనిలబడ వద్దని అనుకున్నా మనసులో.
ఐనా చెప్పి చెప్పి విసిగిపోయి వుంటారు.పాపం వాళ్ళైనా ఎంతకని చెప్తారు.వీళ్ళల్లో మళ్ళీ రౌడీ మూకలుంటై.
వాళ్ళతో ఏం వేగుతారులే అనుకున్నా.ఐన ఈ పని చేయల్సింది కండక్టరూ మనమేనా?ఇంకెవ్వరికీ పట్టలేదా?
ఇంతలో నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది.కొంచెం జరగండి అన్నాను.ఎవరూ విన్న పాపాన పోలేదు.మళ్ళీ అరిచాను లాభం లేదు.ఇక తోసుకొని వెళ్ళాను.మధ్యలోనే ఇరుక్కొపోయా.కాళ్ళు పైకి లేపినా అలానే వున్నా.అంత టైట్ గా బిగించారు.దిగనీయండయ్యా బ్రతిమాలుకున్నా.ఎలాగోలా వూడి, క్రింద కాలు పెట్టే సరీకి బస్ పోతునేవుంది.
క్రింద పడ్డ నన్ను ఎవరో లేపారు.భరించలేని నొప్పి.ఎవరో అనుకుంటున్నారు,నడుము విరిగుండొచ్చని.జేబులో సెల్ ఇచ్చి నెంబర్ చెప్పా మా వాళ్ళది.
ఆ రోజు ఆపరేషన్.
ఆపరేషన్ ఐతే అయింది గానీ నొప్పి తగ్గడం లేదు.నాలుగు నెలలు దాటింది.ఇన్నాళ్ళు నొప్పులకి మందు వాడకూడదంట.సరె ఒక రొజు నా బాధ భరించలేక  పెద్ద హాస్పిటల్ కి తీసికెళ్ళాడుమా బాబాయ్.
వాళ్ళు చెప్పిందేమంటే జరిగిన ఆపరేషన్ సరిగా జరగలేదని,మళ్ళీ చేయాలనీఅన్నారు..
సరే రెండో ఆపరేషన్ లో తొడ ఎముకలో ఒక ముక్క కోసారు..
మా ఆవిడ ఏడుస్తోంది.ఏడవకే అని ఎంత చెప్పినా ఆగట్లా.నా నొప్పీ తగ్గట్లా.
అమ్మా నాన్న ఎక్కడున్నారు అడిగాను.నాకేం తెలుసు అన్నది.నువ్వే గదనే ఎళగొట్టింది.మీరు మాత్రం ఎళ్ళగొట్టలేదా నన్నొక్కదాన్నే అంటారు.అయినా ఎళ్ళ్లగొడితే ఎక్కడున్నారో తెలుస్తుందా ఏంటి.
పదవే ఎతుకుదాం అన్నాను.
రాత్రంతా అన్ని రోడ్లు ఫుట్పాథ్ లూ బస్టాండ్ లూ రైల్వే స్టేషన్లనీ వెతికారు. ఎట్లో అట్ల పట్టుకున్నారు ఓ గుళ్ళో పడుకుని వుంటే...
రావే అమ్మా నాన్నని తీసుకుని మనింటికి వెళ్దాం అన్నాను.
ఇప్పుడు నొప్పి చాలా నయమయింది.

No comments: