Friday, May 29, 2015

మనిషిని ఎట్లా పంపాలి ఎనక్కి.


.
వాకిట్లో నిలబడింది లక్ష్మమ్మ.
తోచదూ తొచదూ అంటుంది.
ఎప్పుడూ .
ఎవరో ఒకళ్ళు ఇంటికి రావాలి .
కూర్చుని కబుర్లు చెప్పాలి. 
ఆ రోజు సాయంత్రం నాకు కాస్త ఖాళీ దొరికింది.అటుగా వెళ్ళా.
నన్ను చూడగానే వాకిట్లోనుండి ఇంట్లోకి తీసికెళ్ళి కూర్చోబెట్టి ముచ్చట్లు మొదలు పెడుతుందేమో నని అనుకున్నా.కానీ ఎంతకి వెనక్కి అడుగెయ్యలా .
అట్లాగే నిలబడి మాట్లాడిస్తున్నా .లక్ష్మమ్మ కూడా ఏదో మాట్లాడుతోంది .
రోజు అంత చక్కగా కూర్చోబెట్టి మాట్లాడిచ్చేది. 
ఈ రోజు ఏమయిందో నా కు అర్థం కాలేదు.
కాసేపు ఇద్దరం మౌనంగా ఉన్నాం.
అప్పుడు అన్నది,'పాపం నీకేమన్న పనుందేమో,నీకేమన్న పనుందేమో .ఎవరి పన్లు వాళ్ళకుంటయ్ దాందేముంది ' రెండు మూడు సార్లు అన్నది.
నాకు అర్థమయ్యింది తిరిగి ఇంటికి వచ్చేసాను.
తరువాత నాకు ఇంకో ఫ్రెండు చెప్పింది బోరు కొట్టనప్పుడు ముచ్చట్లు అఖ్ఖర్లేనప్పుడూ అట్లా పంపించేస్తుందంట.
ఎళ్ళగొట్టే నేర్పు కూడా ఉండాలి అనుకున్నా.

No comments: