Saturday, July 18, 2015

పుణ్యం రావాలి

పుణ్యం రావాలి .
పుణ్యంతో పాటు
ఇన్ ఫెక్షన్లు రావాలి.
దగ్గులూ జలుబులూ,జ్వరాలూ
రావాలి.
షుగర్ పెరగాలి ,హై
బీపీ పెరగాలి,
నడుములు
పట్టెయ్యాలి.
.........................................
జాతీయ రహదారులన్నీ
రద్దీ,బస్సులూ
,రైళ్ళూ కిట కిట
లాడుతున్నై,టాప్
మీద కూడా నిండి
పోతోంది,పదిహేను
కిలోమీటర్ల మేర
ట్రాఫిక్
జాం,ఇరుక్కుపోయిన వీ
ఐ పీ లు,  ఘాట్ లలో   తొక్కిసలాట .
దొంగల చేతి వాటం.
విచ్చలవిడిగా చోరీలు.
ఐనా ఫరవాలేదు.
పుణ్య స్నానం చెయ్యాలి.
చేసిన పాపాలు చాలా ఉన్నై .అవన్నీ పోవాల్సిందే.
ఈ పుష్కర పన్నెండు రోజులు దాటాక స్నానం చేయ్యడానికి
గొదార్లో నీళ్ళుండవ్ .అన్నీ సముద్రంలో కలిసి పోతై.

No comments: