Saturday, September 1, 2012

సిగ్నల్ మారుతోందని స్పీడు పెంచాట్ట.

ఏంటయ్యా తగి లి స్తావ్ నీ బండిని నా బండికి .

అదేంటి సార్ ఇంత ట్రాఫిక్ లొ ఒకళ్ళ బండి ఒకళ్ళకి తగల కుండానే అవుతుందా చెప్పండి.

కానీ నీది పాతది డొక్కుది.నాది చూడు ఎంత కొత్తగ థళ థళ లాడుతోందో చూడు.

వీడెవడండీ ఎనక నుండి గుద్దుతున్నాడూ.

డివైడర్లు కట్టాక ముందునుండి కుదరకా!! నీ ఎంకమ్మా.

సరె సరె కొంచెం ముందుకి కదలు .ట్రాఫిక్ కదులుతోంది.

అదేంటయ్యా ఇక్కడ ఏదో మంట బెట్టారు.

అవన్నీ మీకెందుకు ? మీరు పదండి.

కాస్త చెప్పవయ్యా.

సరె ,వాళ్ళు నిన్నటి నుండి ఇక్కడే ట్రాఫిక్ లో ఇరుక్కు పొయ్యారు.మనం ఇప్పుడే ఇరుక్కున్నాం.

అది సరె నయ్యా.ఆ మంటేంటి.

వంట వంట  కుకింగ్ చేసుకుంటున్నారు .

మరి వంట సామాను ఎక్కడిది.

క్యారీ చేస్తున్నారు.

ఇక్కడ హైద్రాబాద్ లో క్యారీ చెయ్యడం మంచిదని.

ఈ ట్రాఫిక్ నుండి బయట పడి ఇంటికెళ్ళేది ఎన్నాళ్ళకో అని.

వంట సామాను గట్రా గట్రా వెంట బెట్టుకొని రోడ్లమీదకి వస్తున్నారు.

ఇక్కడేదో శవం బైకు పడి ఉన్నయ్ ఇదేంటి.

అబ్బ అన్నీ మీకు కావాలి.
అది ఓ పెద్ద మనిషి సిగ్నల్ మారుతోందని స్పీడు పెంచాట్ట.

అది సంగతి అట్ల మటాష్ అయి పొయ్యాడు.

మరి ఇక్కడ ఈ యాంబులెన్సు ఏంటి డ్రైవర్ నిద్ర పోతున్నాడులా ఉంది.

అది నిద్ర పోవడం కాదు లెండి నిన్న ఓ హార్ట్ ఎటాక్ పేషెంట్ కి సీరియసు గ ఉంటె హాస్పిటల్ కి తీసు కెళు తూ

 ఇక్కడే ఈ ట్రాఫిక్ లో

డ్రైవర్ కి కూడా ఎటాక్ వచ్చి  పేసెంటూ, ఈ డ్రైవరూ ఇద్దరూ పొయ్యారు.

ఇదేంటి ఇక్కడ ఈ వింత

వీళ్ళెవరో  రోడ్డుకి అడ్డంగా పడుకొని ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు మెలికే సికొన్నారు  ,,,,,,,,.

మెలిక కాదు ఫైటింగ్ .

 ఓపికున్నంత వరకూ నిలబడే కొట్టుకున్నారు.ఇప్పుడు ఓపిక తగ్గి పడుకుని కొట్టుకుంటున్నారు.

 ఎందుకని ?

ఎందుకా కారు తగిలి పెయింట్లు పోయినయ్యని..

ఒకడు ముందు తిట్టాడు తరువాత ఇంకోడు తిట్టాడు.

ఏమని తిట్టాడేంటి?

అవి చెప్పలేని తిట్ట్లు, బాబూ.

నువ్వు ఫస్ట్ కదులు నాన్నాకాస్త ముందుకు.


ఇక్కడేదో లారీ ఉంది ఎవరబ్బా,

అదేంటి బావా నువ్వా లారీ లో ఏంటి ?నక్కి నక్కి కూర్చున్నావ్.ఈ లారీ ఏంటీ?ఈ ఇంటి సామానేంటి?

ఇల్లు వెకేట్ చేస్తున్నావా?

నేను ఈ సిటీ  వొదిలి పెట్టి పొతున్నా
.
అదేంటి  మొన్ననేగా కావాలని మరీ హైద్రాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుని  వచ్చావ్.అప్పుడే సర్దుకొని

పోతున్నావ్.అసలేంటి ప్రాబ్లం ఏంటి.

ఏముంది ఈ ట్రాఫిక్.. ఈ ట్రాఫిక్ బాధ భరించలేక రోజూ రాత్రి పూట నిద్రలో ఉలిక్కి పడుతున్నా.

రాత్రుళ్ళు ఒకటే తిట్లు .

ఎవర్ని?

కలలో  ట్రాఫిక్ లో అడ్డం వచ్చినో ళ్ళని .

అది చూసి మీ అక్క నన్ను,,,,,,,,, తిట్లు .

అయితే మెంటల్ తొందరగానే వచ్చిందన్న మాట.

ఇదిగోండి టోకెన్.


టోకెనేంటయ్యా? గవర్నమెంట్ టోకెన్ లు పెట్టింది తెలవదా ?

దేనికి?ఈ ట్రాఫిక్ లో అవెందుకయ్యా?

సార్ మీ నెంబర్ 22 .అంటే 21 సార్లు గ్రీన్ సిగ్నల్ మారాక మీరు వెళ్ళాలి .అప్పటి దాకా కావాలంటే మీ వెహికిల్
 
మీదనే కూర్చుని

 ఇంకేదన్నా పని చేసుకోవచ్చు.

కూ ర్చుని కాక పడుకొనా  ఏంటి ,

నువ్వు కదలవయ్యా సామీ.




No comments: