Monday, September 3, 2012

శ్రమ సాయం,సమయ సాయం


నువ్వు చెప్పేది బాగుందయ్యా.

నువ్వు నీకు చేతనైనంతలో కాస్తో కూస్తో వాళ్ళకీ వీళ్ళకీ నీ  శ్రమ సాయం,సమయ సాయం (ఫిజికల్ హెల్ప్  ,టైం

హెల్ప్) చేస్తున్నావ్.

సరె బాగనే ఉంది.కానీ ఇది బాగ లేదు.ఏది? అదే నువ్వన్నావే దేవుడు నీకు అన్నీ బాగా చేస్తాడు ,

నిన్ను బాగా చూసుకుంటాడు అన్నావే అది బాలేదు.

ఎందుకంటే

నీ లాంటి సాయం చేసినోళ్ళందరికి మంచి జరగాట్లా .

సాయం చెయ్యనోళ్ళందరికి చెడు జరగాట్లా .

అసలీ లెఖ్ఖలన్నీ మనకింకా దొరకలేదు.

అసలు దేవుడున్నాడా లేడా?ఎవరికీ తెలియదు.

నేను కూడా ఉన్నాడనే అనుకుంటా.

అది మన నమ్మకం.

అది ఫస్ట్ పాయింట్.

రెండో పాయింట్,,,,,,,,, ఉన్నాడనే అనుకుందాం.

మరి ఉన్నప్పుడు నువ్వు  ఒకళ్ళకి సాయం చెయ్యాల్సిన పరిస్థితేంటి?

 వాళ్ళకి నీతో చేయించుకోవాల్సిన పరిస్థితేంటి.

కాబట్టి సహాయం చెయ్యటం అనేది మన విచక్షణ, విచక్షణ తో చేసేది.

దానికి ప్రతి ఫలం రిటన్ ఆశించొద్దు.