Friday, September 21, 2012

నా పని అయి పోయిందే ,
ఇంక నేనెన్నాళ్ళో బతకను.
తెల్ల వారుతోందంటే భయం .
ఈ మాయదారోళ్ళు నన్ను చంపుతున్నారనుకో.
నలభై మీద కెళ్తానో లేదో  ఎవడో అడ్డొస్తాడు.
జీరో మీదకి ,..................................................
 మళ్ళీ ఇరవై మీదకి అక్కడి నుండి పదికి  మళ్ళీ ఐదుకి చస్తున్నా .
ఉదయం ఎనిమిదిన్నర నుండి నా భాద చెప్పలేం ఒక గంట వరకు పైకీ కిందికీ పైకీ క్రిందికీ ఒకటే బాధ.
ఎవరికి చెప్పుకోను.
సరె ఇంక నువ్వు వచ్చొచ్చి నాకే చెప్తున్నావ్.
నువ్వు
నాకు చెప్పుకోవడమంటే అదేదో శాస్త్రం చెప్పినట్టుంటుంది.
అదేం, అట్లంటావ్.
అదే మరి, నువ్వింక అదృష్టవంతురాలివి.
మావాడయితే అరవై మీదకి ఛస్తాడు.
ఒకటే తొందర,పనుందా అంటే పనీ లేదు వాడి బొందా లేదు .
కుర్ర ముం.......కొడుకు .
అయ్య బండి కొనిచ్చాడు.
నన్ను ఒకటే చంపుతున్నాడు
రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ ఉందో కూడా చూసి చావడు.
బయ్ బయ్ మని అరవై మీదకి అంతలోనే  యాభై అంతలోనే ఐదూ పదీ .మరి నా ఖర్మ ఇట్లా ఉంది.

No comments: