Thursday, April 2, 2015

కోప్పడొద్దు జాలి పడు .

బాధలు లేని బ్రతుకు లేదు
నువ్వెవ రెవరెవరిని బాధ పెట్టావో .
అదటుంచి,
అలవాటు చేసుకుని బ్రతుకు.
బ్రతకలేక పోతే కృంగి పోయి కృశించి పోయి ఈ లోకం నుండి   ఎలాగూ
ఎగిరిపోయి శాశ్వత ఆనందం పొందు.
////////////////////////////////////////////////////
అవమానాలు  అనుకోవద్దు.
కృతజ్ఞతలు  చూపించట్లేదని శపించొద్దు.
పలకరింపుల కోసం ఎదురుచూపులొద్దు ..
 నిన్ను దూరం పెట్టారని  దిగులు చెందొద్దు.
అన్యాయమని కన్నీరు పెట్టొద్దు .
////////////////////////////////////////////////////////////////////
బాధలు పెట్టేవారు హాయిగా నవ్వుకుంటున్నారా?
ఆనందంగా జీవితం గడుపుతున్నారా ?
ఆ అమాయకులని చూసి కోప్పడొద్దు జాలి పడు .
ఆ ఆనందం ఈ రోజే,మహా అయితే  ఈ సంవత్సరమే .
రేపటి ఆనందానికి గ్యారెంటీ లేదనీ .
పెట్టిన బాధలు పునరావృత్తం కాకపోవనీ.
ప్రక్రుతి శక్తులు చూస్తున్నాయనీ .
తెలుసుకోలేని 
వెర్రి వాళ్ళూ
మిడిసి పడే
మూర్ఖులూ
అమాయకులూ 
ఈ లోకులు .
 

Wednesday, March 18, 2015

కృశించి నశించి పోయే ముసలి వాళ్ళ కంటే

మనసులో ఏవో ఏవో పెట్టుకుని అయిన వాళ్ళనీ ఆత్మీయులైన మనుష్యులనీ  దూరం దూరం పెట్టుకుంటాం.
తలకొరివి పెట్టం అనీ బయటకు తరుముతామనీ
బెదిరింపులూ బ్లాక్ మెయిలులూ చేస్తాం
 వాళ్ళ తప్పులు ఇట్టే పట్టేస్తాం మన తప్పులు పక్కకి నెట్టేస్తాం
విలాసాలూ సరసాలూ సరదాలూ షికారులూ ఇవే కనిపించేవీ వినిపించేవీ మనకి
ఆ మనుష్యుల అంతిమ యాత్ర రోజు అయ్యో   తిరిగొస్తే బాగు సారీ చెప్పుకుంటా సరిగా చూసుకుంటా  అనుకుంటాం కొందరం
సమయం మించి పోయిందని చింతిస్తాం
కృశించి నశించి   పోయే ముసలి వాళ్ళ కంటే
 మనం కన్న మన  పసి వాళ్ళే ఎక్కువ మనకి
సొంత ప్రేమని కొంత కూడా  షేర్ చేసుకోలేం
కృంగి పోయిన మనసులతో ఎంత కాలం బ్రతకాలో తెలియక
చావలేక చావు తనంత తాను రాని
దుర్భర బ్రతుకు మనకీ   ఎంతో దూరం ఉండదు.

Wednesday, March 11, 2015

ఎంతమంది స్నేహితులున్నా అది తక్కువే .

ఎంతమంది స్నేహితులున్నా అది తక్కువే .
స్నేహమంటే స్నేహమే.
స్నేహంలో అవసరాలకి
ఏమీ అడగొద్దు ఇస్తే తీసుకోండి.
తియ్యటి స్నేహాన్ని చేదుగా మార్చుకోకండి .
స్నేహం ఒక అద్భుత మైన పదం.
మోసం చెయ్యొద్దు స్నేహం ముసుగులో.
అవసరాలు తీర్చుకోవద్దు స్నేహం రంగుతో..
ప్రాణం పోయినా ఫరవాలేదు

Sunday, February 15, 2015

ఎంతైనా సొంత పిల్లలు కదా?

ఇప్పుడు ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అన్నాడు దేవుడు.
అవును ఆ ప్రేమ కన్నప్పుడే ఉంటుంది కంటేనే పిల్లలని నేను అంటే మీరు విన్నారా స్వామీ గతంలో మీరు ఏం తప్పు చేసారు అన్నది దేవత.
  >>>>>>                >>>>>>>>>>>>>>                  >>>>>>>>>>>>>>>        >>>>>>>
ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సృష్టి కర్త.
కేవలం మనుష్యులు అందరూ మనుష్యులే సృష్టించ బడ్డారు.
వారికి పిల్లలు కలగరు.ఆడా మగా  తేడా లేదు.అందరూ ఒకటే.
మరి ఈ లోకానికి మనుష్యులు కావాలి .ఏకంగా పెద్దవాళ్ళనే సృష్టిస్తే  వాళ్ళు అన్నీ నేర్చుకోలేరు. ఆది కూడా ఒక సారి జరిగింది.

మరి పిల్లల్ని ఎలా సృష్టించాలి.దానికి దేవుడు కి మొదట అర్థం కాలేదు .తరువాత ఒక ఆలోచన వచ్చింది.
చెట్టుకి కాయలు కాసినట్టు పిల్లలు కూడా కాస్తే.

అలానే కాసారు  .ముద్దుగా ఉన్నారని అందరూ కోసుకునేవారు ,తీసుకునేవారు.కానీ కొన్ని రోజులే  ప్రేమ గా చూసుకునే వాళ్ళు  .ప్రేమ కరువై రక్షణ కరువై పిల్లలు నశించి పోవడం మొదలైంది.

నరజాతి అంతరించి పోతుందనే భయం పట్టుకుంది దేవుడికి.
అప్పుడే సృష్టి  కర్తకి ఆడా మగా సృష్టించాలనే  అలోచన వచ్చింది.వెంటనే అమలులోకి వచ్చేసింది అది.

అప్పటి నుండి పిల్లలు  ఎంతో ప్రేమ పొందుతున్నారు.వాళ్ళకి రక్షణ దొరుకుతోంది.
వాళ్ళ భవిష్యత్తుకి పెద్ద పీట వెయ్యడానికి మనుష్యులు ఒకళ్ళని ఒకళ్ళు దోచుకోవడం కూడా మొదలయింది.
ఎంతైనా సొంత పిల్లలు కదా?

Thursday, February 12, 2015

అడుక్కోవడానికి అడ్డమొచ్చే భిక్ష గాళ్ళు

గ్రీన్ లైట్ సిగ్నల్ పడ్డాక కూడా
 అడ్డమొచ్చే భిక్ష గాళ్ళు.
ముట్టుకునీ,పట్టుకునీ
బలవంతం చేసి మరీ
అడుక్కునే బలమైన వాళ్ళు .

ఈ  బిచ్చగాళ్ళకి
సహాయం చెయ్యాలంటే అసహ్యమే.
కూడళ్ళు లేవా? అంగళ్ళ ముంగిళ్ళు లేవా?


వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ?
కౌన్సిలింగ్ ఇచ్చే భాద్యత ఎవరిది?.
ఎవరు చోద్యం చూస్తూ కూర్చుంటున్నారు?.


వీళ్ళు చాలదన్నట్లు వీధుల్లో ఒరిజినల్ బ్యాట్లతో సిక్సర్లు కొడుతూ
మనుష్యుల ముఖాలు పచ్చళ్ళు చేసే వాళ్ళు
హాస్పిటల్ ఖర్చు పెంచే వాళ్ళు మరి కొందరు.
ఓపిక కి హద్దు.
ఎవరు మారాలి?
ఎవర్ని మార్చాలి
ఎంత టైం కావాలి
ఎన్ని ఎన్నికలు వెళ్ళిపోవాలి?

నేటి దుఖాః న్ని నిన్నటి సంతోషం ఆపుతుందా?

నేటి దుఖాః న్ని  నిన్నటి సంతోషం ఆపుతుందా?
గతంలో ఆస్వాదించిన అనుభూ తులు నేటి కన్నీళ్ళకి ఫుల్ స్టాప్ పెడతాయా?
అంతం ఆరంభమవుతుందా?
నువ్వొక సెలెబ్రిటీ కావచ్చు ,,అమెరికాకి ప్రెసిడెంటు  వి కావచ్చు.
పూరి గుడిసె లో పెద్ద దిక్కు కావచ్చు.
అది రాకుండా మాత్రం ఆగదు.
జననం ఆనందమే అయినా 
జీవితం విషాదంతో  ముగియాల్సిందే
ముగింపు ,,వద్దనుకుంటే  ఆగేది కాదు .
విచారమే  శాశ్వతం.
విశాల విశ్వంలో ఎక్కడికో  మనమెక్కడికో వెళ్ళిపోతాం.
 ఈ ఆహా ఓహో లు ,ఆనందాలు ఒక్క నాడే.
వైభోగం రెండు నాళ్ళే.
మొత్తం కలిపి ఈ జీవితం మూడు నాళ్ళే.
సందర్శనార్థం బయట పెట్టక మానరు.
 సంపాదన కోట్లైనా.

Tuesday, February 10, 2015

కమలం

తొమ్మిది నెలలు గడిచినై పార్లమెంటుకొచ్చి కమలం
బీ జే ఫి ఏదో చేస్తుందని అనుకున్నాడు బజ్జీలమ్ముకునే వాడు కూడా .
 కాస్త కూడా నమ్మకం కలగలేదేమో ?

సామాన్యుడు  సాధించిన విజయం చూసి  సిగ్గేస్తోందా?
లేడీ లనీ ,బేడీ లనీ నిలబెట్టే
ఎత్తుగడల రాజకీయాలు కాంగ్రేసు  నుండి నేర్చుకుంటున్నారా ?
అల్రెడీ నేర్చేసుకున్నారు లా ఉంది .
ప్రజలకి తెలిసి పోతోంది
మీరు కూడా మాజీ ప్రభుత్వానికి, పార్టీకి  ఏమీ తీసి పోరని  .
ఎంతో  నెత్తిన పెట్టుకొని ఢిల్లీ గద్దె నెక్కిస్తే
గల్లీల్లో  పల్లీలమ్ముకునే దుస్తితి  దాపరించింది .
యావత్తు దేశాన్నీ,, మిమ్మల్ని అభిమానించే వాళ్ళని కుళ్ళ బొడిచారు.