Friday, December 14, 2012

డర్టీ ,కక్కూర్తి.


నాక్కొంచెం ఈ మధ్య కళ్ళు తిరుగుతున్నయ్. నాకు ఏ జబ్బు రాకుండ
నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామీ,
నా భార్య పిల్లలకి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వు స్వామీ,
త్వరలో నేను అనుకున్నట్లుగా ఆ జాబ్ నాకు రావాలి స్వామీ,
అమ్మని నాన్నని మంచిగా చూడు స్వామీ,
మా అక్కకి పిల్లలు పుట్టాలి స్వామీ,
మాకు ఎటువంటి డబ్బు సమస్యలు లేకుండ చూడు స్వామీ,
ఈ సంవత్సరం కారు కొనాలనుకుంటున్నా అది అయ్యేట్టు చూడు స్వామీ,
మా ఇంటి పక్కోళ్ళు చాలా బాధలు పడుతున్నారు.వాళ్ళ కష్టాల్ని తొలగించు స్వామీ,
రోజూ నేను ఇంటికొచ్చేప్పుడు కుక్కలు ఎంటబడకుండ చూడు స్వామీ,
.........................................................
........................................................
స్వామీ స్వామీ ప్రత్యక్షం అయ్యావా ?నేనెంత అదృష్ట వంతుణ్ణి
నేనెంత పుణ్యం చెసుకున్నా? స్వామీ స్వామీ ఇప్పుడు నే కొరిన కోర్కెలన్ని తీరుస్తావుగా.
ఓ రీ భక్తా! అదే !నీ ఈ అజ్ఞానాన్ని తొలగిద్దామనే నీకు ప్రత్యక్ష మయ్యా.
నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో నాకు అన్నీ తెలుసు రా.
కోర్కెలు కోరకు.నన్ను స్మరించుకో .నీకు నేను ఇచ్చింది తీసుకో .అది కష్టమే కానీ .సుఖమే కానీ.ధనమే కానీ ,దరిద్రమే కానీ.
అది రా భక్తి అంటే.
కొర్కెల లిస్ట్ చెప్పడం భక్తి కాదురా .డర్టీ కక్కూర్తి.


Thursday, December 13, 2012

కాంటాక్ట్ నెంబర్లు

కాంటాక్ట్ నెంబర్ లు  కాంటాక్ట్ నెంబర్  లు  అని ఏడ్చి గగ్గోలు పెడితే ఇచ్చా.
సరె రా .ఏమైంది ఇప్పుడు ?
 నీ ఫ్రెండ్ గానీ ఏదన్నా వెధవ పని చేసాడా?
అడిగాడు తండ్రి.
అది కాదు డాడీ.
నేను కొన్ని కాంటాక్ట్ నెంబర్లు నా క్లోజ్ ఫ్రెండ్స్ వి ,మన బంధువులవి ఇచ్చాను వేరే ఫ్రెండుకి.
వాడు కావలసిన దానికి వాళ్ళని  ఫొన్  చేసి ఆడిగాడు బాగానే ఉంది.
ఒకసారి అడగాలి.లేదు రెండు సార్లు
.వాళ్ళకి ఇష్టం లేదంటే వదిలెయ్యాలి.
అసలు ఇదేంటి డాడీ పొద్దునా సాయంత్రం రోజుకి రెండు పూట్లా ప్రతి రోజూ వాళ్ళు వద్దన్నా వినకుండా
ఇష్టం లేదన్నా విడిచి పెట్టకుండా రేపు,,రేపు  చేసి గానీ వదిలి పెట్టట్లా.
వాళ్ళందరు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు.
ఎందుకు మా నెంబర్లు ఇన్సూరెన్సు వాళ్ళకి సేల్సు వాళ్ళకి ఇచ్చావని.
అయ్యయ్యో .నీ బాధ నాకు అర్థం అయింది గానీ ,
అదేం భాష రా నువ్వు  మాట్లాడేదీ.
అసలు ఇన్సూరెన్సు కంపెనీ ఏజెంటు కి నెంబర్లు ఇవ్వడమెందుకు ,
ఇట్లా తిట్టుకోడమెందుకు నాన్నా?
కొడుకుని ఓదార్చాడు తండ్రి.

Friday, September 21, 2012

నా పని అయి పోయిందే ,
ఇంక నేనెన్నాళ్ళో బతకను.
తెల్ల వారుతోందంటే భయం .
ఈ మాయదారోళ్ళు నన్ను చంపుతున్నారనుకో.
నలభై మీద కెళ్తానో లేదో  ఎవడో అడ్డొస్తాడు.
జీరో మీదకి ,..................................................
 మళ్ళీ ఇరవై మీదకి అక్కడి నుండి పదికి  మళ్ళీ ఐదుకి చస్తున్నా .
ఉదయం ఎనిమిదిన్నర నుండి నా భాద చెప్పలేం ఒక గంట వరకు పైకీ కిందికీ పైకీ క్రిందికీ ఒకటే బాధ.
ఎవరికి చెప్పుకోను.
సరె ఇంక నువ్వు వచ్చొచ్చి నాకే చెప్తున్నావ్.
నువ్వు
నాకు చెప్పుకోవడమంటే అదేదో శాస్త్రం చెప్పినట్టుంటుంది.
అదేం, అట్లంటావ్.
అదే మరి, నువ్వింక అదృష్టవంతురాలివి.
మావాడయితే అరవై మీదకి ఛస్తాడు.
ఒకటే తొందర,పనుందా అంటే పనీ లేదు వాడి బొందా లేదు .
కుర్ర ముం.......కొడుకు .
అయ్య బండి కొనిచ్చాడు.
నన్ను ఒకటే చంపుతున్నాడు
రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ ఉందో కూడా చూసి చావడు.
బయ్ బయ్ మని అరవై మీదకి అంతలోనే  యాభై అంతలోనే ఐదూ పదీ .మరి నా ఖర్మ ఇట్లా ఉంది.

Monday, September 3, 2012

శ్రమ సాయం,సమయ సాయం


నువ్వు చెప్పేది బాగుందయ్యా.

నువ్వు నీకు చేతనైనంతలో కాస్తో కూస్తో వాళ్ళకీ వీళ్ళకీ నీ  శ్రమ సాయం,సమయ సాయం (ఫిజికల్ హెల్ప్  ,టైం

హెల్ప్) చేస్తున్నావ్.

సరె బాగనే ఉంది.కానీ ఇది బాగ లేదు.ఏది? అదే నువ్వన్నావే దేవుడు నీకు అన్నీ బాగా చేస్తాడు ,

నిన్ను బాగా చూసుకుంటాడు అన్నావే అది బాలేదు.

ఎందుకంటే

నీ లాంటి సాయం చేసినోళ్ళందరికి మంచి జరగాట్లా .

సాయం చెయ్యనోళ్ళందరికి చెడు జరగాట్లా .

అసలీ లెఖ్ఖలన్నీ మనకింకా దొరకలేదు.

అసలు దేవుడున్నాడా లేడా?ఎవరికీ తెలియదు.

నేను కూడా ఉన్నాడనే అనుకుంటా.

అది మన నమ్మకం.

అది ఫస్ట్ పాయింట్.

రెండో పాయింట్,,,,,,,,, ఉన్నాడనే అనుకుందాం.

మరి ఉన్నప్పుడు నువ్వు  ఒకళ్ళకి సాయం చెయ్యాల్సిన పరిస్థితేంటి?

 వాళ్ళకి నీతో చేయించుకోవాల్సిన పరిస్థితేంటి.

కాబట్టి సహాయం చెయ్యటం అనేది మన విచక్షణ, విచక్షణ తో చేసేది.

దానికి ప్రతి ఫలం రిటన్ ఆశించొద్దు.

Saturday, September 1, 2012

సిగ్నల్ మారుతోందని స్పీడు పెంచాట్ట.

ఏంటయ్యా తగి లి స్తావ్ నీ బండిని నా బండికి .

అదేంటి సార్ ఇంత ట్రాఫిక్ లొ ఒకళ్ళ బండి ఒకళ్ళకి తగల కుండానే అవుతుందా చెప్పండి.

కానీ నీది పాతది డొక్కుది.నాది చూడు ఎంత కొత్తగ థళ థళ లాడుతోందో చూడు.

వీడెవడండీ ఎనక నుండి గుద్దుతున్నాడూ.

డివైడర్లు కట్టాక ముందునుండి కుదరకా!! నీ ఎంకమ్మా.

సరె సరె కొంచెం ముందుకి కదలు .ట్రాఫిక్ కదులుతోంది.

అదేంటయ్యా ఇక్కడ ఏదో మంట బెట్టారు.

అవన్నీ మీకెందుకు ? మీరు పదండి.

కాస్త చెప్పవయ్యా.

సరె ,వాళ్ళు నిన్నటి నుండి ఇక్కడే ట్రాఫిక్ లో ఇరుక్కు పొయ్యారు.మనం ఇప్పుడే ఇరుక్కున్నాం.

అది సరె నయ్యా.ఆ మంటేంటి.

వంట వంట  కుకింగ్ చేసుకుంటున్నారు .

మరి వంట సామాను ఎక్కడిది.

క్యారీ చేస్తున్నారు.

ఇక్కడ హైద్రాబాద్ లో క్యారీ చెయ్యడం మంచిదని.

ఈ ట్రాఫిక్ నుండి బయట పడి ఇంటికెళ్ళేది ఎన్నాళ్ళకో అని.

వంట సామాను గట్రా గట్రా వెంట బెట్టుకొని రోడ్లమీదకి వస్తున్నారు.

ఇక్కడేదో శవం బైకు పడి ఉన్నయ్ ఇదేంటి.

అబ్బ అన్నీ మీకు కావాలి.
అది ఓ పెద్ద మనిషి సిగ్నల్ మారుతోందని స్పీడు పెంచాట్ట.

అది సంగతి అట్ల మటాష్ అయి పొయ్యాడు.

మరి ఇక్కడ ఈ యాంబులెన్సు ఏంటి డ్రైవర్ నిద్ర పోతున్నాడులా ఉంది.

అది నిద్ర పోవడం కాదు లెండి నిన్న ఓ హార్ట్ ఎటాక్ పేషెంట్ కి సీరియసు గ ఉంటె హాస్పిటల్ కి తీసు కెళు తూ

 ఇక్కడే ఈ ట్రాఫిక్ లో

డ్రైవర్ కి కూడా ఎటాక్ వచ్చి  పేసెంటూ, ఈ డ్రైవరూ ఇద్దరూ పొయ్యారు.

ఇదేంటి ఇక్కడ ఈ వింత

వీళ్ళెవరో  రోడ్డుకి అడ్డంగా పడుకొని ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు మెలికే సికొన్నారు  ,,,,,,,,.

మెలిక కాదు ఫైటింగ్ .

 ఓపికున్నంత వరకూ నిలబడే కొట్టుకున్నారు.ఇప్పుడు ఓపిక తగ్గి పడుకుని కొట్టుకుంటున్నారు.

 ఎందుకని ?

ఎందుకా కారు తగిలి పెయింట్లు పోయినయ్యని..

ఒకడు ముందు తిట్టాడు తరువాత ఇంకోడు తిట్టాడు.

ఏమని తిట్టాడేంటి?

అవి చెప్పలేని తిట్ట్లు, బాబూ.

నువ్వు ఫస్ట్ కదులు నాన్నాకాస్త ముందుకు.


ఇక్కడేదో లారీ ఉంది ఎవరబ్బా,

అదేంటి బావా నువ్వా లారీ లో ఏంటి ?నక్కి నక్కి కూర్చున్నావ్.ఈ లారీ ఏంటీ?ఈ ఇంటి సామానేంటి?

ఇల్లు వెకేట్ చేస్తున్నావా?

నేను ఈ సిటీ  వొదిలి పెట్టి పొతున్నా
.
అదేంటి  మొన్ననేగా కావాలని మరీ హైద్రాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుని  వచ్చావ్.అప్పుడే సర్దుకొని

పోతున్నావ్.అసలేంటి ప్రాబ్లం ఏంటి.

ఏముంది ఈ ట్రాఫిక్.. ఈ ట్రాఫిక్ బాధ భరించలేక రోజూ రాత్రి పూట నిద్రలో ఉలిక్కి పడుతున్నా.

రాత్రుళ్ళు ఒకటే తిట్లు .

ఎవర్ని?

కలలో  ట్రాఫిక్ లో అడ్డం వచ్చినో ళ్ళని .

అది చూసి మీ అక్క నన్ను,,,,,,,,, తిట్లు .

అయితే మెంటల్ తొందరగానే వచ్చిందన్న మాట.

ఇదిగోండి టోకెన్.


టోకెనేంటయ్యా? గవర్నమెంట్ టోకెన్ లు పెట్టింది తెలవదా ?

దేనికి?ఈ ట్రాఫిక్ లో అవెందుకయ్యా?

సార్ మీ నెంబర్ 22 .అంటే 21 సార్లు గ్రీన్ సిగ్నల్ మారాక మీరు వెళ్ళాలి .అప్పటి దాకా కావాలంటే మీ వెహికిల్
 
మీదనే కూర్చుని

 ఇంకేదన్నా పని చేసుకోవచ్చు.

కూ ర్చుని కాక పడుకొనా  ఏంటి ,

నువ్వు కదలవయ్యా సామీ.




Tuesday, August 21, 2012

పులి గుర్రే రోయ్

బ్యాంక్ లో
ఏ  కౌంటర్ కెళ్ళి నా గుర్రు మని సౌండ్ వస్తోంది నాన్నా .
అంటే నిద్ర గుర్రా ??లేక పొతే పులి గుర్రా ?అడిగాడు తండ్రి.
పులి గుర్రే నాన్నా.
ఉండు నేను చుసోస్తా ................................
.............................................................
అవునురో పులి గుర్రే రోయ్

ఏం  టబ్బా .ఎందుకిం త.
 ఉండు నేనడు గుతా. అసలు ప్రాబ్లం  ఏం టో .
సా ర్  సా ర్ .మీరు ఏమీ  ఆనుకో నంటె  ఒకటడుగుతా .
జీ తా లు సరిగ్గా రావడం లేదా సార్ ?కౌంటర్ లో అడిగాడు.
నీ మొహం రావడంలా .నీ  కెందుకు?
మాకు బీ  పి  పెరిగి హార్ట్ ఎటాక్ కూడా  వచ్చేట్టుంది.
వచ్చిన పని చేసుకొని నీ  దారి నువ్వు పో.విసిగిం చొద్దు.
అమ్మో లాభం లా .
ఇది సామాన్య మైన గుర్రు కాదు.
స్టాఫ్ లేరట.ఉన్న స్టాఫ్ తోటే ఎడ్జెస్ట్ మెంట్ .అది అసలు ప్రాబ్లం .
ఓ కస్టమర్ చెప్పాడు.
దానికి మా అబ్బాయి ఏం  చేస్తాడు.
వాడి మీదా గుర్రు మంటు న్నారు.నా మీద  కూడా .మీకు
మీ వాడికి ఏ  ఫారం నింపాలో ,ఎక్కడ ఇవ్వాలో తెలవక ఇదంతా ప్రాబ్లం.
మరి  ఏది నింపాలో లో ఎక్కడ ఇవ్వాలో వాళ్ళు ట్రయినింగ్  ఇవ్వొచ్చు గా .
ఇప్పటికే స్టాఫ్ తక్కువై వాళ్ళు చస్తోం టే  మీకు,,మీ అబ్బాయికి ట్రయినిం గ్
ఎవడిత్తాడు  పాపం రమ్మని.
పుస్తకాల్లో చదువుకోలా ? కాపీ లు కొట్టి పాసయ్యారా అయ్యా కొడుకులు.
మా బ్యాచుల్లో ఇవన్ని లెవ్వు సామీ. ఉంటే నేర్చుకోమా ఎట్టా.
ఓ పి  కల్లేవ్ .అసలు విషయం అది .మరిక బీ పీ  రాక ఏమొస్తుంది.
.

Saturday, August 18, 2012

ఇదే సందు కదా అని ముందుకెళ్ళా.

డాడీ డాడీ ఏంటి అందరూ ,అన్ని బైకులు అట్లా వెళ్ళి అక్కడ పడి చచ్చిపోతున్నారు.
అవును బేటా వాళ్ళందరికీ ఆఫీసులకీ ఫ్యాక్టరీస్ కి లేట్ అయిందని స్పీడు గా వెళ్తు న్నారు .
మరి అక్కడ ఒకదాన్నొకటి గుద్దు కొని చచ్చిపోతున్నారుగా?
ఇంక ఆఫీసులకి ఎట్లా వెళ్తారు.
వాళ్ళు అదో రకమైన వాళ్ళు రా
ఎల్తే టైం కి ఆఫీస్ కి వెళ్ళాలి లేకపోతే చచ్చి పోవాలి మధ్యలోనే.
మరి మనమేంటి డాడీ  ఆగి ఆగి వెళ్తున్నామూ?
మనకి జాబ్స్ ఏం లెవ్వు నాన్నా.
ఏంటి  డా డీ  ప్రక్కనుండి  ఏదో  వెళ్ళింది.గాలి లో వెళ్ళింది .ఎం టో కూడా   కనబడ లా .ఏంటది?
అది ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,కుర్రాళ్ళు ,,కుర్రాళ్ళు  నాన్నా .బైక్ మీద  వెళ్లున్నారు  .
........        ................                   ............                       .......                                   .......
(అది నరకం అక్కడ  ఓ ఇద్దరూ కలుసుకున్నారు.)
నువ్వెట్లా చచ్చావ్ ?అడిగాడు ఒకడు.
ముందు నువ్వు చెప్పు నెవ్వెట్లా చచ్చావో.
ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు.
సరె సరె చెప్తా విను.
నేను బైక్ మీద వెళ్తున్నా రోడ్డు క్రాస్ చెయ్యాలి కానీ అడ్డంగా ఒక కారు వస్తొంది అగాను .అప్పుడే నా వెనుక మరో కారు వచ్చి నన్ను ఓవర్ టేక్ చేసి కొంచెం ముందుకెళ్ళింది.
అయిందా అక్కడి దాక అర్థం.
తరవాత ఏమైంది చెప్పు మొత్తం చెప్పకుండా ఏంటి?
సరె సరె విను.
మొదటికారు ,ఈ కారూ రెండూ ఆగిపొయ్యాయి .
ఇదే సందు కదా అని ముందుకెళ్ళా.
అటు నుండి ఇంకో బైక్ ,వాడు యమా స్పీడు గా వచ్చి నన్ను తగిలాడు.స్పాట్ .
అయ్యయ్యో ,ఇద్దరూ కార్ల చాటునుండి ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదన్న మాట.
అయ్యయ్యో అనకు నువ్వు పెద్ద పోటు గాడిలాగ.
నువ్వెట్ల చచ్చావో ఇప్పుడు చెప్పు.

సరె చెప్తా ఇను. నేను వెళ్తున్నా. నా ముందు ఇంకోడు .ఇద్దరం బైకుల మీద. ఈ  మద్య  వర్షాలు కదా ?

వర్షాలకి రోడ్ల మీద వాళ్ళని పాతిపెట్టేంత గుంతలు.కదా?
నా ముందోడికి గుంత అడ్డం వచ్చింది.
వాడు పక్కకొచ్చాడు.నేను వాడి వెనుకనే  ఉన్నా
ఇంకేముంది ! పెద్దగ అరిచాను .అదే చావుకేక.
బ్రేక్ కొట్టా,,,,,,,,,,,,,,,, .బండి స్కిడ్ అయింది ,,,,,,,,,,,,,,,,,,,,,.పడ్డాను.
ఎనకనుండి మన బస్సు లు ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,తెలుసుగా,,,,,,,,,,,,,,,,,,,,,,,,, నీకు...... బ్రేకు లు  ఫెయిల్  అవడమే ఎక్కువ .
నన్నెక్కి తొక్కింది .ఇంక డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చా.



.

Friday, July 13, 2012

స్పీ డు గా పోయి మద్యలో పెట్టాలి

చూసావా,, మా వాడి బైక్ .స్పోర్ట్స్ బైక్ .కలర్ ,ఎర్రటి ఎరుపు .మా వాడు .......... .ఆ షైనింగ్ లు చూడు.అన్నది తల్లి.
''డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?'' అడిగింది.పక్కింటి ఆమె.
''ఎందుకు ?నువ్వు మరీ  విచిత్రం.వాడు ,వాళ్ళ నాన్న పేరు చెబితే చాలదూ?వాడి లైసెన్సు అడగడం కాదు గదా వాడి వైపు కుడా చూ డరు  పోలీసులు.''
''అయితే జాగ్రత్త గా  నడుపుతాడా ?''
''అయ్యో ఈ రోజుల్లో పిల్లలకి మనం జాగ్రత్త చెప్పాలా,వాళ్ళే మనకి చెప్తారు. ''
''అసలు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు వాడు.ఎంత ముద్దొచ్చి చస్తున్నాడో! అన్నది తల్లి.''
''ఏరా ,అయిందా ?బయలుదేరదామా? అడిగింది తల్లి''..
.......................................................................................................................................................
.....................................................................................................................................................

'మమ్మీ, ,  ఆ బో ర్డ్  ఏం  టి  ''మీ వివాహమునకు మీరే  బాధ్యులు ''అని రాసారు.. అంటే ఏంటి మమ్మీ  ?అన్నాడు కొడుకు..
నీ  బొంద బోర్డు సరిగ్గా చదవ వు . నన్ను చంపుతావ్.
అది వివా హం కాదు  ''మీ వాహనము నకు మీ రే బాధ్యులు ''అయి ఉంటుంది .''''.అన్నది  వెనుక కూర్చున్న మమ్మీ..
''ఈగ  ''హిట్టు మమ్మీ  .''మేం వయసుకు వచ్చాం'' కొత్త సినిమా రిలీజ్''.......................................................పోస్టర్ లు చూ స్తూ,  చదువుతూ బండి నడుపుతున్నాడు.
బండి స్పీడు  పెంచాడు సడెన్ గా  .
''ఏంట్రా అంత స్పీ డు ''.
''ఏం  లేదు'',........ ''ఏం  లేదు సిగ్నలు మారుతోంది.గ్రీ న్  పోతోంది. అందుకే''.
''అయ్యో''
 .................................................................
........................................................................................................................................................

''మళ్లీ  ఏంట్రా ?ఈ స్పీ డు ''..
''రోడ్డు దాటాలి మమ్మీ  .
ఇక్కడ సిగ్నల్ ఉండదు.
స్పీ డు  గ పోనిచ్చి రోడ్డు మద్యలో పెట్టా లి అప్పుడు గాని క్రాస్స్  చెయ్యటం కుదరదు.ఎవరు ముందు పెడితే వాళ్ళే .
ఆయన ఎవరో చూ డు  ఎంత సేపట్నుం డి అక్కడే ఉన్నాడో ,
అట్లా అయితే తెల్లారుతుంది.
ధైర్యం ధైర్యం ,ఉండాలి మమ్మీ .
స్పీ డు  గా  పోయి మద్యలో పెట్టాలి .అప్పుడు గాని వీ ళ్ళ  రోగం కుదరదు.సిటీ  లో  అట్ల ఉంటే నే తప్ప బతకలేం.''.............................................................................................................................................................
...........................................................................................................................................................
''అయ్యో అయ్యో !చెప్తే వినలా ''
యా క్సి డెంట్ !
పడేసి చచ్చావ్ ''.
''నడిరోడ్డు మీ ద  పడేసావ్ .కాలు మళ్లి   విరిగింది.
ఇంతకుముందు విరిగినప్పుడే   డాక్టర్లు ఆపరేషన్ చేసారు.సక్సెస్ కాలేదు.
ఒక కాలు పొట్టి ఒక  కాలు పొడుగు. ఒక చెప్పు హైట్ ,ఒక చెప్పు డౌనూ .ఈ సారి ఇంకా   పొట్టి అయితుం దేమో . ఒక కాలు మోకాలు వరకు వస్తుందేమో''.

Thursday, July 12, 2012

కారు ని ఆపించాడు పోలీసు .


కారు ని ఆపించాడు పోలీసు .
గ్లా స్  దించి బయటకు చూ సాడు లాయర్   శర్మ.
లైసెన్సు, పొల్యూ షన్ ,ఆర్ సి ,ఇన్స్యురెంస్  తొందరగా తియ్యమన్నాడు కానిస్టేబుల్.
పొల్యూ షన్  లేదేంటి అడిగాడు కానిస్టేబుల్.
'శర్మ లాయర్  శర్మ 'అంటూ  సీ రియస్  గ చూసాడు లాయర్  శర్మ.
చెయ్యి ఊపి  వెళ్ళ మన్నాడు కానిస్టేబుల్.
బార్ లో కూర్చున్నారు  శర్మ అతని ఫ్రెండ్స్.
'నా కొద్దు.నే తీసుకోను .ఇంటి కెళ్ల డం ఇబ్బంది.అదీ కాక పోలీసు  చెకిం గ్స్ '.అన్నాడు ఫ్రెండు.
ఊరు కోవయ్యా ! ''లాయర్ శర్మ'' అను ఎవరన్న అడిగితే 'అన్నారు లాయర్.
బయటకు వచ్చి కారు తీయ బో యాడు శర్మ.
''రాంగ్  పార్కింగ్ .ఫైన్ పే చెయ్యాలి''. అడిగాడు కానిస్టేబుల్.
''అయ్యో శర్మ బాబూ  శర్మ లాయర్ శర్మని  నేను''.................................................
...........................................................................................................................
కారు లో శర్మ అండ్ ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నారు కబుర్లు  చెప్పుకుంటూ.
ఒక ఫ్రెండు మాత్రం బైక్ మీద  బయలు దేరాడు.
కాసేపటికి శర్మ కి ఫోను.
అటునుండి''బాబాయ్,బాబాయ్, పోలీసు  పట్టుకున్నాడు.డ్రింక్ డ్రైవ్ అంటున్నాడు."
''ఎక్కడున్నావ్ .........సరే సరే వస్తున్నా అక్కడే ఉండు'' .
శర్మ స్పాట్ కి చేరుకున్నాడు.ఫ్రెండు కి హెల్ప్ చెయ్యడానికి.
సేం  డైలాగ్ రిపీ ట్  చేసాడు.శర్మ.
''లాయర్ శర్మ వే , కాదన ట్లా .
రెస్పాన్స్ బుల్  సిటిజన్ వి కావా  నువ్వు?
దేశానికి సేవ ఎట్లాగు చేసే మొహం లా  లేదు నీ ది .
కనీసం రూల్స్ పాటించ వయ్యా  ప్లీ డ ర్  లాయరు మొగడా '' అన్నాడు కానిస్టేబుల్..


Friday, July 6, 2012

ఇంత అందంగా కూడా ఉంటారా??

మానింగ్ టైం ...కూల్ ..కూల్ గ క్లైమేట్ (వాతా వరణం).
పల్సా ర్  మీద  ఆశిష్..
విశాల మైన రోడ్డు..
అతిగా ఆలోచించ కుండా స్లో గా  బండి నడుపుతున్నాడు..
ఇంతలో ........................................
ఎవరో ఓవర్ టేక్  చేసారు..
అది స్కూ టీ ..
ముందొక అమ్మాయి డ్రైవ్ చేస్తోంది..
వెనుక ఒక ఆమె కూర్చుంది.
నమ్ము నమ్మకపో! .ఇదే ఫస్ట్  టైం !.ఇంత అందంగా కూడా ఉంటారా??
' అతిలోక సుందరి 'మనసులో..తనలో తను.. .........  ఆనందంలో ఆశిష్.
ఇంత ఫర్ఫెక్ట్టా......
 .'ఇంత పర్ఫెక్ట్  గ ఉన్న వాళ్ళు ఎక్కడో ఎక్కడో''
ఇట్లాంటి ,ఇంత అందమైన వాళ్ళు మన మధ్యనే ఉంటారా?"అశ్చ్యర్యం  లో ఆశిష్..
రంగు కి రంగు ,అందానికి అందం అన్నింటికి అన్నీ '
వెనుకాలే ఫాలో అవుతున్నాడు....
క్లోజ్ క్లోజ్ గా .
ఆమె ఫోన్ లో మాట్లా డు తోంది .వన్ సైడ్ కూర్చుంది..
వన్ సైడే  కనిపిస్తోంది..
స్త్ర్రె ట్  గ చూస్తే  ఎట్లా ఉంటుందో..అదే ఫ్రంట్ సైడు..
అటు కూ డా ఇదే అందమా ...లేక అందుకు భిన్న మా..(డిఫరెంట్))
ఎనీ  వే  కొంచెం ముందుకెళ్ళి చూ ద్దాం .((((((((((((((((((((((((((((((((((((ఇన్ ప్రోగ్రెస్)).
'నీ వు  నా  దా నివే..నేను నీ వాడినే..
చిలిపి నవ్వుల నిను చూడగానే
వలపు పొంగేను నా లో నా .......'
బాలు గా రి పా ట ని హం చేస్తున్నాడు ఆశిష్....
జీవితంలో ఇంతకన్నా ఆనంద ఘడియలు ఉంటాయా??
కొంచెం స్పీ డ్ ..ఇంకొంచెం స్పీ డ్ .....
నో సరిపోవట్ల .ఆ ఫేస్ ఫుల్ పిక్చర్ క్యాచ్ చెయ్యలేక పోతున్నాడు..
ఇంకొంచెం స్పీడ్ ......
అయిపోయింది ....అయిపోయింది .......చూసేస్తున్నా ......
అన్నం ఉడుకుతూ  మూత లేస్తున్నట్లు మ్యాన్ హోల్ మూ త లేస్తూ పడుతూ ఉంది..
 పచ్చని ప్లస్ చక్కని వాసన తో  నీ ళ్లు  పారుతూ ఉన్నాయి రో డ్డు మీద .
పక్కనే పెద్ద పబ్లిక్ టాయి లెట్ .
సన్నటి కంకర ,,నీ ళ్ల కి తో డు ,,, వంకర రోడ్డు .
ఎగ్జాట్ పిక్చర్ కోసం  బ్రేక్ బట్  .
మర్చిపోయి  ఫ్రంట్ బ్రేక్ .... .
అసలు ఈ నీళ్ళు కాళ్ళ మీద పడితేనే తట్టుకోలేను అటువంటిది నేను నేనే  మొత్తం పడ్డాను.చ్హ.
..




 .

Sunday, July 1, 2012

ఆమె నా వైపే చూస్తోం దా ?

ఆమె నా  వైపే చూస్తోం దా ?అవును సందేహం లేదు.రోడ్డు కిఇటువైపు ,నందు, నిల్చున్నాడు.
ముందు కొంచెం ఇబ్బంది గా  అనిపించినా తరువాత ఆసక్తిగా మారింది సీను .
ఆ అమ్మాయి ఇప్పుడు నవ్వుతోం దా ?అవును డౌటే  లేదు. అనుకున్నాడు మనసులో.
షిట్! ట్రా ఫిక్ .అమ్మాయి రోడ్డు కి అటు వైపు నేను ఇటువైపు.
ఇన్నాళ్ళు నేను వయసు పై బడిన వాడిలా కనిపిస్తున్నా అనుకుంటూ ఉన్నా .
నో నో .నా గురించి నేనే
తప్పు అంచనా వేసుకుంటున్నా.
అ రె ఈ మధ్య డై కూడా వేసికోట్లా  .
వేసికొం టె ?ఓహ్!
ఆనందంతో కన్ఫ్యూస్ అయి పోతున్నాడు నందు..
భగవంతుడు ఒక్కొరికీ ఒక్కో గొప్పదనం ఇస్తాడంటారు .
నిజమే.... ఆ దేవుడికి కృతజ్ఞతలు (థ్యాంక్స్) చెప్పుకోవాలిసిం దే.
రోడ్డు దాటి వెళ్ళనా ?
 నో..  చీప్  అయిపోతా .
అనవసరంగా ,నాకు నేను ఈ చాన్సు పోగొట్టు కున్న ట్లు అవుతుంది..
అంతా  చెడ గొట్టు కున్న ట్లు అవుతుంది.
నే నంటే  అంత ఇష్ట పడే ఆమె తనకి తనే వస్తుంది.రా వా లి .
మరొక్క సారి చూ  సా డు .రెప్ప కూ డా వాల్చకుండా చూస్తోం దే.
పాపం ఆ రెప్పలు అలిసిపోయి వడలి పొతే తరువాత బాధ పడ వలసింది తనే.
ఇహ ఎంత మాత్రం ఆలస్యం చెయ్యొద్దు.
కానీ  ,ఎలా ?
ఇంత డిఫికల్ట్ సిచ్యు ఎషన్ ని హ్యాండిల్ చెయ్యడం. .
ఎనీ వె .నేనే వెళ్ళాలి.అనుకు న్నాడు.
కానీ ఆమే  రోడ్డు దాటి రాబోతోంది.
కంట్రోల్ .కంట్రోల్.అనుకున్నాడు.
అమ్మాయి నా కంటే చాల చిన్నది.
దీ న్ని బట్టి ఇప్పుడు నా వయసు ని నేను తిరగ రాసుకోవాల్సిన టైం  వచ్చిం దని తెలుస్తోంది
సో, సో,
అమ్మాయి దగ్గరికి వచ్చింది.
ఇంకా దగ్గరికి వచ్చింది.
మీ అమ్మాయి పల్లవి ఫ్రెండ్ ని .
గుర్తు పట్టలేదా అంకుల్?
 మీ ఇంటికి ఒకసారి వచ్చా.
చాలా రోజులైంది లెండి అన్నది...

Wednesday, June 27, 2012

లేటు లేటు లేటై o ది.

ఎంటే మీరు కూడా వచ్చేసారు అన్నది అశ్చ్యర్యం  గా స్వర్గంలో  ఉన్న బామ్మ  .
కూతురిని మనమ రాలిని  చూసి ముందు సంతోషించి వెంటనే బాధ పడిపోతూ 'ఎందుకే నాతో  కూడా వచ్చేసారు.మీకేం తొందర వచ్చింది అని కోప్పడింది.
అది కాదు అమ్మా  అని కూతురు చెప్పబోతే మనమ రాలు 'నేను చెప్తా  బామ్మా అని మొదలెట్టింది.
బామ్మా నువ్వు నిన్న సాయంత్రం పోయ్యావని  మాకు కబురొచ్చింది
.మేమేమో సూరత్ లో ఉన్నాం.అక్కడి నుండి వచ్చేసరికి నిన్ను ఉంచు తారో  లేదో ,
ఆఖరి చూపు అందుతుం దో  లేదో అని డౌ టు  వచ్చింది.
 ఫ్లయిట్  లో వద్దామం టె  అక్కడ ఎఇర్ పోర్ట్ లేదు.
అందుకని ముందు బాంబే కి ట్రెయిన్  లో వచ్చాం.
అక్కడి నుండి ఫ్లయిట్  లో పొద్దున్న ఎనిమిది గంటలకి హైదరా బాదు  చేరాం .
ఇక శంషా  బాద్ లో ట్యాక్ సీ  మాట్లాడుకున్నాం.
డ్రైవర్ జాగ్రత్తగా నెమ్మదిగా మమ్మల్ని ఇంటికి తీసుకు వస్తున్నాడు.
అమ్మకేమో కంగారు.నిన్ను చూస్తామో లేదో అని ఒకటే గోల ఏడుపు.
డ్రైవర్ ని తొందర పెట్టింది.
బాగ  సతాయించి నానా గోల పెట్టింది.
లేటు లేటు లేటు లేటై  o ది  అని.
ఆ  కంగారులో డ్రైవర్ డివైడర్  ని కొట్టి కారు పల్టీ  కొట్టించా డు .
ముగ్గురం వచ్చేసాం .
డ్రైవర్ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటాడు.
మీ లేటు   కాలిపోనూ  అన్నది బామ్మ .
ఇంకేముంది అంతా కా లే పోయ్యాం 
ఇప్పుడు మన అందరి పేర్ల కి ముందు లేటు అని పెడతారు  అన్నది మనమ రాలు.

Tuesday, June 26, 2012

సినిమాల లో .........

 చాల రోజులైంది నిన్ను చూసి .భలే కలిసాం.అంతా  ఓ కే కదా.
హోటల్ లో కుర్చుని మాట్లాడుకుందాం  రా అన్నాను రఘు తో..
రఘు నేను టి త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం.
నేను సీరియల్స్ ,కొన్ని సినిమాల లో చాల చిన్న పాత్రలు  వేస్తున్నానని చెప్పాను.
త్వరలో నాకో పెద్ద క్యారెక్టర్ కూడా ఇవ్వ బోతున్నారు అని చెప్పాను .
నీ కె ట్ల  అయింది .ఎవరు చాన్సు ఇచ్చారు ?
 మొత్తానికి భలే సాధించావు  అన్నాడు రఘు.
అవును ఇది నా అదృష్టమే అన్నాను.
అవును కాని ఎట్లా  ఎట్లా ఎంటర్ అయ్యావు? అడిగాడు రఘు.
నాకు ఓపిక లేక పోయినా  తెచ్చుకుని మాట్లాడాను .ఎంతైనా నా చిన్న నాటి ఫ్రెండు కదా అని.
ఒక డైరెక్టర్ గారు ఉన్నారు.
నేను వాళ్ళ అమ్మాయికి  ట్యూషన్ చెప్పాను.అదీ  ఎవరో ఒక వ్యక్తీ ద్వారా కుదిరింది .. రోజూ  వాళ్ళింటికి వెళ్లే  వాడిని .ఒకరోజు  డైరెక్టర్ గారు నన్ను అడిగారు.ఒక చిన్న రోల్ ఉంది చేస్తావా  అని.ఇంకేంటి నా పంట పండింది అను 
కున్నా.అసలే నా చిన్నప్పటి కోరిక కదా.
ఇక ఆ రోజు షూటింగ్ లో ఒక చిన్న డైలాగ్ కూడా ఉంది.బ్రహ్మాడంగా చెప్పాననుకో.
ఇంకేముంది ఎంటర్ అయి పోయ్యా .విషయం మా వాడికి చెప్పాను.
సరే సరే నాకు కూడా కొంచెం పరిచయం చెయ్యవా   అన్నాడు రఘు.
ఏమని చెయ్యాలి అడిగాను.
నేను కూడా ట్యూ  షన్  చెప్తా నని చెప్పు  ప్లీజ్ ప్లీజ్ అన్నాడు.
సరే అని ఫోను తీసాను .నాకున్న పరిచయంతో మాట్లాడి విషయం చెప్పాను డైరెక్టర్ గారి మిసెస్ కి,వాడి ఫోను నెంబర్ కుడా ఇచ్చాను.
ఎటూ  ఇప్పుడు నేను సరిగ్గా వెళ్ళలేక పోతున్నా  కాబట్టి.
ఫోను చేసాక రఘు నా  ఫోను చేతిలోకి తీసికొని కాసేపు చూసి మళ్ళి  నాకిచ్చేసాడు.
డైరెక్టర్ గారు ఉళ్ళో  ఉండరు. ఎప్పుడు ఏదో షూటింగ్ కాని  ఎక్కడెక్కడో ఉంటారు అని చెప్పాను .
అయితే ఎక్కువగా ఇంట్లో ఉం డరన్న  మా ట . అన్నా డు  రఘు.
అవును అన్నాను.
సరే చాలా  టైం  అయింది అను కొని  ఇద్దరం ఎవరి దారిన వాళ్ళం వచ్చేసాం.
అర్థరాత్రి నాకు డైరెక్టర్ గారి నుండి ఫోను.వాళ్ళ వైఫ్ కి వచ్చిన మెసేజ్ ల గురించి
You,  the one I want,  I need, .  I want to say that I LOVE U!



Words are not enough to express just how much I love you. : you are the air I breathe, 


my heart belongs to you. Goodnight baby.
ఈ మెసేజ్ లన్నీ డైరెక్టర్ గారి మిసెస్ కి వచ్చిన య్ .నెంబరు మాత్రం మా వాడిదే.మా వాడి  నిర్వాకం అది.
నా చాన్సు లన్నీ  పోయినయ్ .